ఓటు వేసి పెళ్లి చేసుకున్న జంటలు, ముహూర్తానికి ముందు పోలింగ్ కేంద్రాల్లో సందడి !
దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టకముందే ఓ వరుడు పరుగున వచ్చి ఓటు వేసిన ఘటన కర్ణాటకలోని చామరాజనగర్ తాలూకాలోని సంతేమరల్లిలో చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుంటున్న యువకుడు ముహూర్తానికి గంట ముందు పోలింగ్ కేంద్రానికి పరుగు తీసి ఓటు వేసి తరువాత కల్యాణపండపం చేరుకుని వధువు మెడలో తాళి కట్టడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.
తాళి కొట్టే శుభ ముహూర్తానికి ముందే వరుడు చేతన్ పోలింగ్ కేంద్రానికి వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు పెళ్లి మూహుర్తాన్ని ఫిక్స్ చేశారు. అయితే పెళ్లి ముహూర్తానికి ముందే వరుడు చేతన్ పోలింగ్ కేంద్రం దగ్గరకు పరుగుతీసి ఓటు వేసిన తరువాత వెళ్లి పెళ్లి చేసుకున్నాడు, పోలింగ్ బూత్ వద్దకు పరుగున వెళ్లిన పెళ్లి కొడుకు చేతన్ క్యూలో నలవడి ఓటు వేశారు,

పెళ్లి రోజు పెళ్లి బట్టలతో పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో నిలబడి ఉన్న వరుడు చేతన్ కు అతని కుటుంబ సభ్యులు మద్దతు పలికి వారు కూడా ఓటు వేశారు. శుభ ముహూర్తానికి సమయం మించిపోవడంతో వరుడు పరుగున వచ్చి పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో నిలబడి ఓటు వేస్తున్న సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంటిలో కుర్చుని ఓటు వెయ్యకుండా నిర్లక్షం చేస్తున్న యువతి, యువకుల ఈ ఘటనే ఉదాహరణగా ఉండాలని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికలను వీడిన ఓటర్లు వినియోగించుకోవడానికి వచ్చాను. ఓటు వేయడం మన ప్రథమ కర్తవ్యం. ఎవరూ ఓటు వేయకుండా ఉండకూడదు. అందుకే తాళికట్టే ముందు తాను పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశానని, అందరూ కచ్చితంగా ఓటు వెయ్యాలని కొత్త పెళ్లికొడుకు చేతన్ మీడియాకు చెప్పారు, కేం్రందరానికచప్పట్లు కొట్టేలోపు వచ్చి ఓటేశాను అని చేతన్ అన్నారు.
చిక్కమగళూరు, మడికేరిలో కూడా పెళ్లి రోజు ఓటు వేసిన తరువాత వదూవరులు పెళ్లి చేకుననారు. కుటుంబ సభ్యులు, వధూవరులు పోలింగ్ బూత్ లకు వచ్చి ఓటు వేసేందుకు కాస్త ఇబ్బందిగా ఉంది. అయితే కొన్ని చోట్ల వధూవరులు పోలింగ్ బూత్‌లకు వచ్చి ఓట్లు వేసినట్లు గుర్తించారు. చిక్కమగళూరు, మడికేరిలో పెళ్లికి ముస్తాబయిన ఇద్దరు వధువులు పోలింగ్ బూత్‌ను సందర్శించి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు.












Click it and Unblock the Notifications