వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరీ కరుణానిధి? ఇదీ రాజకీయ నేపథ్యం-ఎన్నో రికార్డ్‌లు: కీలక అంశాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: ముత్తువేల్ కరుణానిధి.. దశాబ్దాల పాటు తమిళనాడును శాసించిన రాజకీయ దురంధరుడు. అభిమానులు కలైంగర్ అని పిలుచుకుంటారు. 1969-2011 మధ్య అయిదుసార్లు తమిళనాడుకు ముఖ్యమంత్రిగా పని చేశారు. రాజకీయాల్లోకి రాకముందు తమిళ సినీ పరిశ్రమలో సంభాషణల రచయితగా ఉన్నారు. తమిళంలో ఆయన కథలు, నాటకాలు, నవలలు ఎన్నో రాశారు. తమిళ సాహిత్యానికి ఆయన చేసిన సేవ ఎంతో గొప్పది.

Recommended Video

జయకు నో, కరుణకు ఏమంటారో!!!

1924లో బ్రిటిష్ వారి పాలనలో ఉన్న మద్రాస్ ప్రెసిడెన్సీలోని తిరుక్కువలై (నాగపట్నం జిల్లా)లో తమిళ నాయిబ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులుముత్తువేలర్, అంజుగం. కరుణ అసలు పేరు దక్షిణామూర్తి. చదువుకునే రోజుల్లో డ్రామా, కవిత్వం, రచనపై ఆసక్తి కబరిచారు. జస్టిస్ పార్టీకి కీలక నేత అలగిరిస్వామి ప్రసంగాలతో ఉత్తేజితుడయ్యారు. 14వ ఏటనే సాంఘీక పోరాటలవైపు అడుగేశారు.

ఇదీ కరుణానిధి ఫ్యామిలీ

ఇదీ కరుణానిధి ఫ్యామిలీ

ముత్తువేల్ కరుణానిధి తమిళనాడును దశాబ్దాల పాటు శాసించారు. ఆయన 3 జూన్ 1924లో నాగపట్నం జిల్లా తిరుక్కువాలైలో జన్మించారు. కరుణానిధి తల్లిదండ్రులు ముతువెల్లు, అంజుల. ఆయన అసలు పేరు దక్షిణామూర్తి. ముగ్గురు భార్యలు, ఆరుగురు సంతానం. భార్యలు పద్మావతి, దయాళు అమ్మాల్, రాజత్తి అమ్మాల్. కుమారులు ముత్తు, అళగిరి, స్టాలిన్, తమిళరసు. కూతుళ్లు కనిమొళి,సెల్వి.

1957లో తొలిసారి ఎమ్మెల్యే.. మొత్తం 13సార్లు

1957లో తొలిసారి ఎమ్మెల్యే.. మొత్తం 13సార్లు

కరుణానిధి తమిళనాడు మూడో ముఖ్యమంత్రిగా 1969లో బాధ్యతలు చేపట్టారు. మొత్తం ఐదుసార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. 2006లో అయిదోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నాటకం, సినిమా, కళలు, సాహిత్యంపై ఆయనకు ఆసక్తి. దాదాపు నలభై సినిమాలకు స్క్రిప్ట్ అందించారు. ఇరవై ఏళ్ల వయస్సులో తొలిసారి రాజకుమారి సినిమాకు స్క్రిప్ట్ అందించారు. 1957లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.1957 నుంచి 2016 వరకు 13సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.కులితలై, తంజావూరు, సైదాపేట, అన్నానగర్, నౌకాశ్రయం, చెపాక్, తిరువరూర్ నియోజకవర్గాల నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1984లో పోటీకి దూరంగా ఉన్నారు.

హిందీ వ్యతిరేక ఉద్యమం, నాస్తికవాదం

హిందీ వ్యతిరేక ఉద్యమం, నాస్తికవాదం

1961లో ఆయన డీఎంకే కోశాధికారిగా ఉన్నారు. 1962లో శాసన సభా పక్ష ఉపనేతగా ఉన్నారు. 1967లో పబ్లిక్ వర్క్స్ మంత్రిగా సేవలు అందించారు. ప్రస్తుతం తిరువరూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. 14 ఏళ్ల వయస్సులో సామాజిక ఉద్యమాల్లో నిమగ్నమయ్యారు. హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. నాస్తిక వాదానికి కొత్త ఊపిరి పోశారు.

33 వయస్సులో అసెంబ్లీలో అడుగు

33 వయస్సులో అసెంబ్లీలో అడుగు

కరుణానిధి 1941లో మురసోలి పత్రికను ప్రారంభించారు. డీఎంకే అధికారిక పత్రికగా అవతరించిన మురసోలి. ద్రవిడ స్వీయ గౌరవం ఉద్యమంలో పాల్గొన్నారు. పెరియార్ భావజాలం పట్ల ఆకర్షితుడయ్యారు. 33 ఏళ్ల వయసులో 1957లో డీఎంకే తరపున ఆయన తమిళనాడు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 1961లో డీఎంకే కోశాధికారిగా, 1962లో ప్రతిపక్ష డిప్యూటీ లీడర్‌గా బాధ్యతలను నెరవేర్చారు. 1967లో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. కరుణానిధి.. 1969 ఫిబ్రవరి 10 నుంచి 1971 జనవరి 4వ తేదీ వరకు, 1971 మార్చి 15 నుంచి 1976 జనవరి 31 వరకు, 1989 జనవరి 27 నుంచి 1991 జనవరి 30 వరకు, 1996 మే 13 నుంచి 2001 మే 13 వరకు, 2006 మే 13 నుంచి 2011 మే 15 మధ్య సీఎంగా ఉన్నారు.

కరుణానిధి వీటిల్లో తొలి వ్యక్తి, ఎంజీఆర్ ఉన్నంత కాలం ఓటమిలు..!

కరుణానిధి వీటిల్లో తొలి వ్యక్తి, ఎంజీఆర్ ఉన్నంత కాలం ఓటమిలు..!

1969లో అన్నాదురై చనిపోయిన తర్వాత కరుణానిధి ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. డీఎంకే తొలి అధినేత కరుణానిధే. పెరియార్ మీద ఉన్న గౌరవంతో అన్నాదురై ఉన్నంత కాలం అధ్యక్ష పదవి ఖాళీగానే ఉంది. అన్నాదురై పార్టీ జనరల్ సెక్రటరీగానే ఉండేవారు. చలనచిత్ర పరిశ్రమ నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన తొలి వ్యక్తి కరుణానిధి. ఎమర్జెన్సీని సమయంలో రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలలో డీఎంకే మాత్రమే కేంద్రాన్ని వ్యతిరేకించింది. ఆ సందర్భంగా ఎంతోమంది డీఎంకే నేతలు అరెస్ట్ అయ్యారు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత జనతా పార్టీతో కరుణానిధి పొత్తు పెట్టుకున్నారు. దీనికి కొన్నేళ్ల ముందే పార్టీ నుంచి ఎంజీఆర్‌ను కరుణ బహిష్కరించారు. దీంతో ఎంజీఆర్ అన్నాడీఎంకే పార్టీని స్థాపించారు. ఎమర్జెన్సీ తర్వాత జరగిన ఎన్నికల్లో డీఎంకే ఓడిపోగా, అన్నాడీఎంకే గెలుపొందింది. 1987లో ఎంజీఆర్ చనిపోయేంత వరకు పలు ఎన్నికల్లో డీఎంకే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

 కరుణానిధిని అరెస్టు చేయించిన జయలలిత

కరుణానిధిని అరెస్టు చేయించిన జయలలిత

కరుణానిధిని 1971లో అన్నామలై యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. తంజావూర్ యూనివర్శిటీ ఆయనను రాజరాజన్ అనే బిరుదుతో సత్కరించింది. 2001లో ఫ్లైఓవర్ల నిర్మాణంలో అవినీతి ఆరోపణలతో అప్పటి జయలలిత ప్రభుత్వం కరుణను అరెస్ట్ చేయించింది. ఎల్టీటీఈ సంస్థకు కరుణానిధి సాయం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 2009లో ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎల్టీటీఈ నేత ప్రభాకరన్ తనకు మంచి మిత్రుడు కరుణ చెప్పారు.

ఐదు దశాబ్దాలుగా పార్టీ అధ్యక్షుడిగా

ఐదు దశాబ్దాలుగా పార్టీ అధ్యక్షుడిగా

దాదాపు 50 ఏళ్ల పాటు డీఎంకే అధ్యక్షుడిగా ఉన్నారు. 1969లో అధ్యక్షుడై చనిపోయే వరకు కొనసాగారు. కరుణా 13 సార్లు శాసనసభకు ఎన్నికైన రికార్డు అత్యధిక కాలం తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేసిన రికార్డు ఉంది. విజయనగర సామ్రాజ్యధీసుల కాలంలో వీరి కుటుంబం ఆంధ్ర ప్రాంతం నుంచి తమిళనాడుకు వలస వచ్చినట్లు చెబుతారు. తండ్రి వద్ద బాల్యదశలో కొంతకాలం కరుణానిధి నాద స్వరం కూడా నేర్చుకున్నారు. ద్రావిడోద్యమంలో భాగంగా హేతువాదులైన ద్రావిడ నాయకులు మతపరమైన పేర్లను త్యజించిన తరుణంలో ఆయన సొంత పేరును కరుణానిధిగా మార్చుకున్నారు.

English summary
End of an era! Former DMK President and five-time chief minister of Tamil Nadu M Karunanidhi passed away in Kauvery hospital, Chennai. He was 94.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X