Flipkart: రూ.76,000 యాపిల్ మ్యాక్ ఆర్డర్ చేస్తే.. రూ.3000 బోట్ స్పీకర్స్ వచ్చాయి..!
ఒకప్పుడు ఏదైనా కొనాలనుకుంటే షాపులకు వెళ్లి కొనాల్సి వచ్చేది. ఏదైనా తినాలన్నా ఇంట్లో చేసుకుని తినాలి లేదా హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుటు ఏం తినాలన్నా.. ఏం కొనాలన్నా ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులకు ఈ కామర్స్ సైట్లను ఆశ్రయిస్తున్నారు. ఇండియాలో ఎక్కువగా ఫ్లిప్ కార్ట్, అమెజాన్ యాప్ ల్లో ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారు. వేసుకునే చెప్పుల నుంచి టీవీలు, ల్యాప్ టాప్స్, మొబైల్స్ అన్ని ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి.
అయితే ఆన్ లైన్ షాపింగ్ తో నష్టం కూడా ఉంది. ఆన్ లైన్ షాపింగా సైబర్ ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంటుంది. అంతకాకుండా ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి వస్తూ ఉంటుంది. తాజాగా ఓ వ్యక్తి యాపిల్ మ్యాక్ బుక్ చేస్తే బోట్ స్పీకర్స్ వచ్చాయి. దీంతో ఆ వ్యక్త్ షాక్ తిన్నాడు.అథర్వ ఖండేల్ వాల్ ఫ్లికార్ట్ లో యాపిల్ మ్యాక్ బుక్ ఆర్డర్ పెట్టాడు. అయితే మ్యాక్ ఇన్ టైమ్ లో డెలివరీ కాలేదు. కొంత సమయం పట్టింది.

దీంతో అతనే దగ్గరలో ఉన్న ఫ్లిక్ కార్ట్ హబ్ కు వెళ్లి పార్శిల్ తీసుకున్నాడు. అక్కడే అతను పార్శిల్ ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యాడు. పార్శిల్ లో యాపిల్ మ్యాక్ బుక్ కు బదులు బోట్ స్పీకర్స్ వచ్చాయి. దీంతో ఫ్లికార్ట్ హబ్ నిర్వహకులను ప్రశ్నించాడు. తాను రూ.76,000 చెల్లించి యాపిల్ మ్యాక్ ఆర్డర్ చేస్తే రూ.3000 విలువైన బోట్ స్పీకర్స్ వచ్చాయని వాపోయాడు.
— atharva khandelwal (@atharva_1913) August 21, 2023
దీనిపై అతను ఫ్లికార్ట్ కస్టమర్ కేర్ ఫోన్ చేశాడు.తనకు రీఫండ్ చేయాలని కోరాడు. ఓపెన్ బాక్స్ కు వర్తించే నో రీఫండ్ ప్రకారం డబ్బు తిరిగి ఇవ్వడం కుదరదని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అథర్వ ఖండేల్ వాల్ పార్శిల్ ఓపెన్ చేస్తున్న వీడియోను ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇంత ఘోరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. అతనికి వెంటనే రీఫండ్ చేయాలని కోరుతున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు ఫ్లిప్ కార్ట్ యాజమాన్యం స్పందించలేదు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications