రిటైర్ కాబోతోన్న వారికి ఈ దేశంలో ఎలాంటి విలువ లేదు: సీజేఐ ఎన్వీ రమణ

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో అత్యంత కీలకమైన పిటీషన్‌పై విచారణ కొనసాగుతోంది. ఈ పిటీషన్ రాజకీయ పార్టీలతో ముడిపడి ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్నికల ప్రచార సమయంలో ఆయా పార్టీలు ఇచ్చే ఆర్థికపరమైన హామీలను నియంత్రించాల్సి ఉంటుందనే విషయంపై దాఖలైన పిటీషన్ అది. దీన్ని ఇదివరకే సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై కేంద్రానికి కొన్ని సూచనలు కూడా చేసింది.

ఉచితాలపై కమిటీ..

ఉచితాలపై కమిటీ..

ఓటర్లను ప్రభావితం చేసే ఉచిత పథకాల హామీలపై పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్రానికి సూచనలు చేసింది. నీతి ఆయోగ్, ఫైనాన్స్ కమిషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అధికార- ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రతినిధులతో ఈ కమిటీని ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఉచిత హామీలనేవి తీవ్రమైన ఆర్థిక అంశాలకు సంబంధించినదిగా వ్యాఖ్యానించింది.

బీజేపీ నేత దాఖలు చేసిన పిటీషన్..

బీజేపీ నేత దాఖలు చేసిన పిటీషన్..

అసలు ఉచిత పథకాలు ఎందుకు?, ఎంతవరకు అమలవుతాయి?, వాటిని నియంత్రించడం ఎలా? అనే వాటిపై విధి విధానాలను రూపొందించాలని సూచించింది. బీజేపీ నాయకుడు, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటీషన్ ఇది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమ కోహ్లీతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించింది. ఈ పిటీషన్‌కు కౌంటర్‌గా ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ పిటీషన్ వేసింది. డీఎంకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇందులో ఇంప్లీడ్ అయ్యాయి.

కమిటీకి సుప్రీం మాజీ న్యాయమూర్తి..

కమిటీకి సుప్రీం మాజీ న్యాయమూర్తి..

సీనియర్ అడ్వొకేట్ వికాస్ సింగ్ తన వాదనలను వినిపించారు. ఉచిత హామీలను నియంత్రించడానికి ఉద్దేశించిన నీతి ఆయోగ్, ఫైనాన్స్ కమిషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అధికార- ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రతినిధులతో ఈ కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించడం స్వాగతించదగ్గ పరిణామం అని అన్నారు. ఈ కమిటీకి పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఛైర్మన్‌గా నియమించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

 వారికి ఎలాంటి విలువ లేదు..

వారికి ఎలాంటి విలువ లేదు..

దీనికి సీజేఐ ఎన్వీ రమణ బదులిచ్చారు. తమ విధుల నుంచి పదవీ విరమణ చేసిన లేదా పదవీ విరమణ చేయబోతోన్న వ్యక్తులకు ఈ దేశంలో ఎలాంటి విలువ లేదని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. రిటైర్ అయిన లేదా రిటైర్ కాబోతోన్న వారి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఉచితాలను నియంత్రించడానికి ఉద్దేశించిన కమిటీ నియామకానికి కేంద్రం కూడా కొన్ని మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉందని చెప్పారు.

ఉచితాలకు వ్యతిరేకం..

ఉచితాలకు వ్యతిరేకం..

ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలను వినిపించారు. కేంద్ర ప్రభుత్వం.. ఉచితాలకు వ్యతిరేకమని తేల్చి చెప్పారు. ఉచితాలకు వ్యతిరేకంగా దాఖలైన ఈ పిటీషన్లకు కేంద్రంగా అనుకూలంగా ఉందని చెప్పారు. ఓటర్లను ప్రభావితం చేయదగ్గ ఉచిత హామీలు ఆర్థిక వ్యవస్థకు పెనుభారంగా పరిణమిస్తాయని వ్యాఖ్యానించారు. ఆర్థిక విధ్వంసానికి కారణమౌతాయని పేర్కొన్నారు. కేంద్రం అందుకు సమ్మతించదని చెప్పారు.

ఎల్లుండి రిటైర్మెంట్..

ఎల్లుండి రిటైర్మెంట్..

కాగా- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ.. ఎల్లుండి పదవీ విరమణ చేయబోతోన్న విషయం తెలిసిందే. ఇంకో రెండు రోజుల్లో ఆయన రిటైర్ కాబోతోన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ 2014 ఫిబ్రవరి 17వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులు అయ్యారు. గత ఏడాది ఏప్రిల్ 24వ తేదీన ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యారు. శరద్ అరవింద్ బాబ్డే నుంచి బాధ్యతలను స్వీకరించారు. ఇక జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ తదుపరి సీజేఐగా నియామకం కానున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇదివరకే ఉత్తర్వులు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+