విచిత్రం: దేవుడికి ఉత్తరాలు బట్వాడా చేసే పోస్టాఫీస్
శబరిమల: అదో విశిష్టమైన పోస్టాఫీసు. ఆ పోస్టాఫీస్ దేవుడికి ఉత్తరాలు బట్వాడా చేస్తుంది. ఆ పోస్టాఫీసు శబరిమల కొండలకు సమీపంలోని ప్రసిద్ధ హిందూ దేవాలయం వద్ద ఉంది. ఏడాది అంతా పనిచేయని పోస్టాఫీస్ బహుశా ఇది ఒక్కటే కావచ్చు. అయ్యప్ప ఆలయానికి యాత్రికులు రావడం ప్రారంభించే సీజన్ నుంచి ఇది పనిచేయడం ప్రారంభిస్తుంది.
నవంబర్‌లో మలయాళం నెల ప్రారంభమయ్యే రోజు నుంచి జనవరి మధ్యలో అది ముగుస్తుంది. విషు సీజన్‌లో పది రోజుల పాటు ఆ పోస్టాఫీసు పనిచేస్తుంది. వారంలో ఆరు రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తుంది. అందులో ఆరుగురు ఉద్యోగులున్నారు. 23 ఏళ్ల సాయి జి. ప్రకాష్ వారికి బాస్.
అతి సహజంగానే ఆశీర్వాదాలు కోరుతూ తమకు వివాహాలకు, దుకాణాల ప్రారంభానికి ఆహ్వాన పత్రికలు వస్తాయని ప్రకాష్ ఓ వార్తాసంస్థతో చెప్పారు. తమిళనాడు, కర్ణాటక, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి తమకు ఆ పత్రికలు వస్తాయని చెప్పారు.

ఆలయ సముదాయంలో మూడు లెటర్ బాక్సులున్నాయి. పోస్టు కార్డులు, ఎన్వలప్స్‌లతో పాటు ఐడెంటిటీ కార్డులు, వాలేలు వాటిలో ఉంటాయి. ప్రతి ఉదయం వాటిని తెరిచి చూస్తారు. సంబంధిత వ్యక్తులకు వాటిని తాము బట్వాడా చేస్తామని, ఉద్యోగులు వాటి కోసం సాధారణంగా తమ సొంత డబ్బులు ఖర్చు చేస్తారని ప్రకాష్ చెప్పారు.
ఈ సీజన్ ప్రారంభం నుంచి తాము 29 పాన్ కార్డులు ఆదాయం పన్ను శాఖ కార్యాలయానికి బట్వాడా చేసినట్లు ఆయన తెలిపారు. ఇదంతా పిక్ పాకెటర్స్ పని అని, యాత్రికుల వాలేలు దొంగిలించి వాటిని వాటిలో పడేస్తారని పోలీసులు అంటున్నారు. పాంబా నుంచి శబరిమల ఆలయానికి నడకదారి ఉంటుంది. సీజన్‌లో ఆలయా్ని 4.5 మిలియన్లకు పైగా భక్తులు సందర్శిస్తారు. కొంత మంది భక్తులు వచ్చి కార్డులు, కవర్లు కొని తమ చిరునామాను రాసుకుని ఇక్కడ పోస్టు చేస్తారని ప్రకాష్ చెప్పారు.
ఆలయ ప్రసాదాన్ని పోస్టు చేసే సౌకర్యాన్ని కూడా పోస్టాఫీసు కల్పిస్తుంది. మొబైల్ రిచార్జ్ కార్డులు కూడా విక్రయిస్తుంది. ఆరుగురు ఉద్యోగులు కూడా ప్రతి రోజూ స్వామి అయ్యప్పకు రాసిన ఉత్తరాల సంచులు మోస్తూ కొండపైకి వస్తారు. తాము ఎంతో ఆనందంగా ఉన్నామని, ఈ విధమైన పోస్టింగులు రావడం తమకు సంతోషంగా ఉందని ప్రకాష్ అన్నారు.












Click it and Unblock the Notifications