కాబోయే సీఎం ఆయనే..

Ajit Pawar: ఇంకొన్ని గంటలు. మరాఠా గడ్డపై కొత్త ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనే విషయం తేలిపోనుంది. శనివారం మధ్యాహ్నానికి దీనిపై ఓ స్పష్టత రానుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ కూడా శివసేన (ఏక్‌నాథ్ షిండే)- భారతీయ జనతా పార్టీ- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్) సారథ్యంలోని మహాయుటికి జైకొట్టాయి.

మేజిక్ ఫిగర్ ఎవరికి..

వాస్తవ ఫలితాలు ఎలా ఉండబోతోన్నాయనేది ఇంకొన్ని గంటల్లో స్పష్టమౌతుంది. మొత్తం 288 నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 145. దీన్ని ఎవరు అందుకుంటారు? 2019 తరహాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందా? ఎగ్జిట్ పోల్స్‌కు అనుగుణంగా మహాయుటి అధికారంలోకి వస్తుందా? అనే విషయం ఉత్కంఠత నెలకొంది.

A poster depicting Ajit Pawar as the Chief Minister put by in Pune

మహాయుటిలో..

మొన్నటి వరకు మహాయుటి ప్రభుత్వమే కొనసాగిందిక్కడ. 2019 నాటి ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్ఫాటు చేయడానికి అవసరమైన సంపూర్ణ మెజారిటీ రాలేదనే విషయం తెలిసిందే. ఫలితంగా ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేనతో కలిసి ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెలకొల్పాయి. మహా వికాస్ అఘాడీగా ఏర్పడ్డాయి.

అఘాడీలో చీలిక..

అఘాడీ ప్రభుత్వం ఎంతో కాలం పాటు కొనసాగలేకపోయింది. బీజేపీ చేపట్టిన ఆపరేషన్ కమల దెబ్బకు కుప్పకూలింది. తొలుత శివసేన, ఆ తరువాత ఎన్సీపీలో చీలికను విజయవంతంగా తీసుకునిరాగలిగింది. చీలిక వర్గ నేతలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కమలం. ముఖ్యమంత్రిగా శివసేన చీలిక వర్గ నేత ఏక్‌నాథ్ షిండే కొనసాగారు.

ఇప్పటి పరిస్థితిపై..

ఈ సారి మహాయుటి అధికారంలోక వస్తే ముఖ్యమంత్రి కుర్చీపై ఎవరు ఆసీనులవుతారనేది ఉత్కంఠత రేపుతోంది. బీజేపీ ఈ పదవిని దాదాపుగా వదులుకోకపోవచ్చు. పార్టీ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిస్‌కు మరోసారి సీఎంగా అవకాశం కల్పించడం ఖాయంగా కనిపిస్తోంది.

వారిద్దరి మాటేంటీ?

అదే జరిగితే బీజేపీ బలపడటానికి ప్రధాన కారకులుగా ఉంటూ వచ్చిన ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌ల మాటేంటనేది ప్రశ్న తలెత్తుతోంది. వారిద్దరికీ ఉప ముఖ్యమంత్రులుగా కొనసాగించే అవకాశాలు లేకపోలేదంటూ వార్తలు వస్తోన్నప్పటికీ.. షిండే డిప్యూటీ హోదాను ఏ మాత్రం కోరుకోవట్లేదని అంటున్నారు.

కాబోయే సీఎం ఆయనే..

ఈ పరిస్థితుల మధ్య అజిత్ పవార్ పేరును తెరమీదికి తీసుకొచ్చారు ఆయన అభిమానులు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీలికవర్గం నాయకులు. కాబోయే ముఖ్యమంత్రి అజిత్ పవారేనంటూ పెద్ద ఎత్తున బ్యానర్లు కట్టారు. ముంబై, పుణేతో పాటు అజిత్ పవార్ సొంత నియోజకవర్గం బారామతిలో విస్తృతంగా ఈ బ్యానర్లు వెలిశాయి. ఆ తరువాత వాటిని తొలగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+