మూడో భార్య ఇంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ?, అర్దరాత్రి ఏం జరిగింది, శవం మాత్రం !
బెంగళూరు: మద్యం మత్తులో ప్రమాదవశాత్తు ఇంటి నాలుగవ అంతస్తు నుంచి పడి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి మృతి చెందిన సంఘటన బెంగళూరు నగరంలోని అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున చోటుచేసుకుంది.
మల్లతహళ్లి ఎంపీఎం లేఅవుట్‌లో నివాసం ఉంటున్న మునంజినప్ప అలియాస్ అంజినప్ప (63) అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి మృతిచెందాడని పోలీసులు అన్నారు.
తెల్లవారుజామున 3 గంటల సమయంలో అంజినప్ప ఇంటి నాలుగో అంతస్థులోకి వెళ్లడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అంజినప్ప మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని పోలీసులు అన్నారు. మొదటి భార్య ఉమాదేవితో కలిసి బాగల్‌కుంటేలో నివాసం ఉంటున్నాడని పోలీసులు అన్నారు.

అదేవిధంగా గురువారం అంజినప్ప అతని మూడో భార్య గీతా ఇంటికి వెళ్లాడని, ఆ రోజు అర్దరాత్రి కూడా మద్యం సేవించిన అంజినప్ప తెల్లవారుజామున నాలుగవ అంతస్తు మీదకు వెళ్లాడని పోలీసులు అంటున్నారు. ఆ సమయంలో అంజినప్ప నాలుగో అంతస్తు మీద వాకింగ్ చేస్తున్న సమయంలో ఆయన అదుపుతప్పి కిందపడిపోయాడని పోలీసులు అంటున్నారు.
వెంటనే స్థానికులు, మూడో భార్య గీతా కలిసి అంజినప్పను ఆసుపత్రిలో చేర్పించారు. అయితే తీవ్ర రక్తస్రావం కావడంతో అంజినప్ప తుదిశ్వాస విడిచినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. గీతా తన భర్త అంజినప్పను కొట్టి చంపిందని మృతుడి మొదటి భార్య ఉమాదేవి అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భూస్వామి అయిన అంజినప్పకు బాగల్‌కుంటే, మల్లతహళ్లితోపాటు ఇతర ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నాయని పోలీసు అధికారులు అంటున్నారు. అంజినప్ప ఆస్తుల విషయంలో ఆయన భార్యల మధ్య మనస్పర్థలు వచ్చాయని, అంజినప్ప మొదటి భార్య ఉమాదేవికి ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు.
అంజినప్ప రెండో భార్యకు సంబంధించిన సమాచారం తెలియడం లేదని పోలీసులు అన్నారు. ఏడేళ్ల క్రితం వివాహమైన గీతాను అంజినప్ప మూడో వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు భార్యలు ఉన్న అంజినప్పతో చాలా మంద వివాహిత మహిళలు క్లోజ్ గా ఉంటున్నారని తెలిసిందని స్థానికులు అంటున్నారు.












Click it and Unblock the Notifications