నా అనుమతితోనే..పంక్షన్ వెళ్లాలి లేదంటే కాల్చేస్తా ,మాట వినని భార్యను కాల్చిన భర్త
తన మాట వినకుండా ఓ ఫక్షన్ కు వెళ్లిందనే కోపంతో ఉత్తరప్రదేశ్ లోని ఓ భర్త తన భార్యపై కాల్పులు జరిపారు. బెదిరింపు కోసం ముందు గాల్లోకి కాల్పులు జరిపినా... తన మాట వినకపోవడంతో నేరుగా ఆమే కాళ్లపై కాల్చి తన ప్రతాపాన్ని చూపించాడు రియల్టర్ అయిన భర్త

యూపి లోని బాద్‌షాపూర్ పరిధిలో ఘటన
ఉత్తర ప్రదేశ్ లో ని బాద్‌షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రవైట్ స్కూల్లో కామర్స్ భోధిస్తున్న టీచర్ స్కూల్లో వీడ్కోలు పార్టీ జరిగింది. వీడ్కోలు పార్టీతో పాటు అక్కడ ఫ్యాషన్ షో కూడ నిర్వహించారు. అయితే స్కూల్ వీడ్కోలు ఫంక్షన్ వెళతానని టీచర్ భర్త అనుమతిని తీసుకుంది. అయితే అక్కడ జరిగే ఫ్యాషన్ షోకు వెళ్లవద్దని ఆమే భర్త చెప్పాడు..

వద్దన్నా... ప్యాషన్ షోలో పాల్గోందని అవేశంతో ఊగిపోయిన భర్త
అయితే భర్త అనుమతితోనే స్కూల్ ఫంక్షన్ వెళ్లిన టీచర్ అక్కడ జరిగే ఫ్యాషన్ షో లో కూడ పాల్గోంది. ఈనేపథ్యంలోనే తన ఆలస్యమైన ఇంటికి రాకపోవడంతో భర్త ఇంద్రజిత్ నేరుగా స్కూల్ వెళ్లాడు. అక్కడి వెళ్లి టీచర్ ఫోన్ చేశాడు. దీంతో ఆమే ఉన్న లోకెషన్ మ్యాప్ ను వాట్సప్ ద్వార పంపింది. దీంతో అక్కడికి చేరకున్న భర్త ,టీచర్ ను చూసి అశ్చర్యపోయాడు. దీంతో ఆవేశంతో ఊగిపోయాడు.

మొదటి హెచ్చరికంగా గాల్గోకి కాల్పులు
తనతో ఇంటికి రావాలని భర్త కోరాడు అయితే టీచర్ నిరాకరించడంతో తన ఆవేశం మరింత కట్టలు తెచ్చుకుంది. దీంతో మొదటి హెచ్చరికంగా గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో ఆమే పరుగులు పెట్టే ప్రయత్నం చేసింది. అయినా వెంటపడ్డాడు. అందరు చూస్తుండగానే మరోసారి ఆమే కాళ్లపై కాల్చాడు.












Click it and Unblock the Notifications