Bore Well: 100 అడుగుల లోతుకు చిన్నారి.. కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్..
మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో 300 అడుగుల లోతైన బోరుబావిలో పడిన చిన్నారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సైన్యం బుధవారం ఆపరేషన్ ప్రారంభించిందని ప్రభుత్వ అధికారి తెలిపారు. బాలికను రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని భోపాల్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. మంగళవారం జిల్లాలోని ముంగావలి గ్రామంలోని వ్యవసాయ భూమిలో రెండున్నరేళ్ల చిన్నారి సృష్టి కుమారి అనే బాలిక ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయింది.
పాప మొదటగా 30 అడుగుల లోతులో చిక్కుకోగా.. తర్వాత 50 అడుగులకు పడిపోయింది. తాజాగా తవ్వకం, డ్రిల్లింగ్ ప్రకంపనల కారణంగా ఆమె బోర్‌వెల్ లోపల 100 అడుగుల లోతుకు జారిపోయింది. ఆర్మీ బృందం ప్రస్తుతం 35 లోతు వరకు తవ్వకాలు జరిపిందని జిల్లా పంచాయతీ, సెహోర్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆశిష్ తివారీ తెలిపారు. ఆర్మీ రెస్క్యూ టీమ్ కూడా రాడ్లు, తాడు వేసి బాలికను రక్షించడానికి ప్రయత్నించినప్పటికీ వారు విఫలమయ్యారు.

మధ్యలో రాయి అడ్డురావడంతో రెస్క్యూ ఆపరేషన్‌లో బృందాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో సృష్టి బోరుబావిలో పడిపోయిందని, అప్పటి నుంచి ఆమెను రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ విలేకరులతో చెప్పారు. "మేము రెస్క్యూ ఆపరేషన్ కోసం ఆర్మీ బృందాన్ని పిలిపించాము, అయితే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు అత్యవసర ప్రతిస్పందన దళం (SDERF) ఇప్పటికే బాలికను రక్షించే పనిలో ఉన్నాయి" అని తెలిపారు.
"చిన్నారిని రక్షించడానికి ఢిల్లీ, రాజస్థాన్ నుంచి బృందాలను పిలిపించారు. రెస్క్యూ ఆపరేషన్‌ను పూర్తి చేయాలని మేము ఆశిస్తున్నాము" సెహోర్ పోలీసు సూపరింటెండెంట్ మయాంక్ అవస్తీ . బోరుబావిలో ఉన్న బాలికకు ఆక్సిజన్ నిరంతరం సరఫరా చేస్తున్నామని అధికారి తెలిపారు. కానీ ఆమె స్పందించడం లేదని చెప్పారు. గత నెలలో విదిశలో ఓ బాలుడు బోరుబావిలో పడిపోయాడు. అతన్ని బయటకు తీశారు.. కానీ మృతి చెందాడు.












Click it and Unblock the Notifications