Viral Video: వీధుల్లో హల్ చల్ చేసిన ఖడ్గమృగం.. వీడియో వైరల్..
ఈ మధ్య అడవుల్లో ఉండాల్సిన జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం జనగామ జిల్లా కల్వకుర్తిలో ఎలుగుబంటి జనావాసాల్లో సంచరించింది. అయితే జంతువులు జనావాసాల్లోకి రావడానికి అడవులు తగ్గడమే ప్రధాన కారణమని చెబుతున్నారు. మానవ తప్పిదాలతోనే జంతువులు బయటకు వస్తున్నాయని చెబుతున్నారు.

అవి వస్తే అంతే..
పులులు, సింహాలు, ఎలుగుబంటి వంటి జంతువులు ఊళ్లలోకి వస్తే ప్రాణనష్టం తప్పదు. అందుకే అడవులను నాశనం చెయ్యొద్దని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. తాజాగా ఓ ఖడ్గమృగం జనావాసాల్లోకి వచ్చి అందరిని ఆందోళనకు గురి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పరుగెత్తిన ఖడ్గమృగం..
ఈ వీడియోను IFS అధికారి సుశాంత నంద పోస్ట్ చేశారు. "మానవ నివాసం ఖడ్గమృగాల ఆవాసంలోకి వెళుతున్నప్పుడు... పట్టణానికి వెళ్లే ఖడ్గమృగంతో గందరగోళం చెందకండి" అనే శీర్షికతో. ఒక ఖడ్గమృగం జనావాసాలున్న పట్టణంలోని ఖాళీ వీధి గుండా పరిగెడుతున్నట్లు వీడియో చూపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా మంది చూపరులు కనిపిస్తారు.
వాహనంపై దాడి..
ఒక వ్యక్తి ఆటో నుంచి దిగి ఇంటి లోపలికి పరుగెత్తడం కూడా వీడియోలో కనిపిస్తుంది. ప్రజలు నందా వ్యాఖ్యతో ఏకీభవించారు. అడవులకు సమీపంలో నివాసాలను ఎందుకు అనుమతించారని కొందరు ఆశ్చర్యపోయారు. పశువుల క్షేమాన్ని కూడా ప్రజలు అడిగి తెలుసుకున్నారు. అస్సాంలోని మానస్ నేషనల్ పార్క్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది, అక్కడ ఆందోళన చెందిన ఖడ్గమృగం పర్యాటక వాహనంపై దాడి చేసింది.












Click it and Unblock the Notifications