ఏదో చెయ్యాలని అనుకున్న రౌడీషీటర్, ఎలక్ట్రానిక్ సిటీలో? వీవర్స్ కాలనీలో వెంటాడి వెంటాడి!
ఐటీ హబ్ బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో మరోసారి రౌడీషీటర్లు రెచ్చిపోయి సినిమా స్టైల్లో వెంటాడి వెంటాడి దాడులు చేసుకున్నారు. అనేకల్‌లో రౌడీ షీటర్ల బెడద మితిమీరిపోవడంతో స్థానిక ప్రజలు హడలిపోతున్నారు. పాత కక్షల కారణంగా ఓ రౌడీషీటర్‌ను ఆయుధాలతో నరికి చంపిన ఘటన బెంగళూరు నగర శివార్లలోని ఆనేకల్ పట్టణంలోని వీవర్స్ కాలనీలో చోటుచేసుకుంది.
మంజునాథ్ అలియాస్ మెంటల్ మంజ అనే రౌడీషీటర్ దారుణ హత్యకు గురైనాడు. రౌడీషీటర్ మెంటల్ మంజును సినిమా స్టైల్‌లో చుట్టుపక్కల వీదుల్లో వెంటాడి వెంటాడి నరికేశారు. రౌడీషీటర్లు రెచ్చిపోవడంతో స్థానికులు ప్రాణభయంతో దిక్కుతోచక పరుగులు తీశారని ప్రత్యక్ష సాక్షలు అంటున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మెంటల్ మాంజను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.

అయితే చికిత్స విఫలమై రౌడీషీటర్ మెంటల్ మంజు మృతి చెందాడని పోలీసులు తెలిపారు. శశికుమార్, విజయ్ అలియాస్ టాటూ విజయ్‌లు కలిసి మెంటల్ మంజును హత్య చేసినట్లు సమాచారం. హత్యకు గురైన మెంటల్ మాంజా అండ్ గ్యాంగ్ మొదట టాటూ విజియన్‌ను కొట్టి దాడి చేశారు. అయితే మెంటల్ మంజు దాడి నుంచి తప్పించుకుని కొద్ది దూరం వెళ్లిన తరువాత టాటు విజయ్, శశి వేట కొడవళ్లతో అదే మెంటల్ మంజును వెంటాడి వెంటాడి హత్య చేశారని పోలీసులు అంటున్నారు.
ఆరు ఏడు నెలల కిందట ఓ ఇంట్లోకి ప్రవేశించిన మెంటల్ మంజు అతని అనుచరులు బీభత్సం సృష్టించారని ఆనేకల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసుకు విజయ్ అలియాస్ టాటూ వీజీ సాక్షిగా ఉన్నాడు. అయితే నిన్న టాటూ వీజీకి ఫోన్ చేసిన మెంటల్ మంజు కోర్టులో తనకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వొద్దని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో మెంటల్ మంజు, టాటూ వీజీల మధ్య ఫోన్‌లో పెద్ద గొడవ జరిగిందని తెలిసింది.

ఆ తర్వాత టాటూ వీజీ ఇంటి సమీపంలోకి తన గ్యాంగ్ తో కలిసి వెళ్లిన మెంటల్ మంజు అతని మీద దాడి చేశాడు. మెంటల్ మంజు అతని అనుచరులు ఆ ప్రాంతంలోని రోడ్డుపై టాటూ వీజీని వెంటాడి వెంటాడి కొట్టారని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. అయితే అప్పటికి టాటూ వీజీ స్నేహితుడు శశి అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మద్య గొడవలు పెద్దవి అయ్యాయి. తరువాత మెంటల్ మంజుతో పాటు అతని అనుచరుల దగ్గర ఉన్న వెటకొడవళ్లను లాక్కొన్న టాటు విజయ్, శశి ప్రత్యర్థుల మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించారు.
మెంటల్ మంజును ఇలాగే వదిలేస్తే ఎప్పటికైనా మమ్మల్ని చంపేస్తాడని అనుకున్న టాటు విజయ్, శశి తరువాత మెంటల్ మంజును అదే వీదుల్లో వెంటాడి వెంటాడి నరికి చంపేశారని పోలీసులు అన్నారు. మెంటల్ మంజును హత్య చేసిన టాటు విజయ్, శశి పారిపోయారని, వారి కోసం గాలిస్తున్నామని ఆనేకల్ పోలీసులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా వీవర్స్ కాలనీతో పాటు ఆనేకల్ లోని పలు ప్రాంతాల్లో పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications