couple: కార్పోరేట్ కంపెనీలో దంపతుల ఉద్యోగాలు, పని మనిషికి నరకం చూపించారు. ప్రైవేట్ పార్ట్స్ మీద?

శాడిస్టు దంపతులు 17 ఏళ్ల ఇంటి పనిమనిషిని కొట్టి, ఆమె శరీరంలోని వివిధ భాగాలను బ్లేడ్ తో కోసి, కాలిన వస్తువులతో ఆమె శరీం మీద కాల్చారు. యువతిని నానారకాలుగా శారీరకంగా హింస పెట్టిన దంపతులకు సినిమా కనపడింది.

గురుగ్రామ్/ న్యూఢిల్లీ: కుటుంబ సమస్యల కారణంగా మైనర్ అయిన యువతి ఇంటి పని చెయ్యడానికి ఓ ఇంటిలో చేరింది. అయితే శాడిస్టు దంపతులు 17 ఏళ్ల ఇంటి పనిమనిషిని కొట్టి, ఆమె శరీరంలోని వివిధ భాగాలను బ్లేడ్ తో కోసి, కాలిన వస్తువులతో ఆమె శరీరం మీద కాల్చారు. యువతిని నానా రకాలుగా శారీరకంగా, మానసికంగా హింస పెట్టిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు.

17 ఏళ్ల ఇంటి పనిమనిషిని శారీరకంగా, మానసికంగా, లైంగికంగా వేధింపులకు గురి చేసిన జంట ఇంటిలో మైనర్ బాలికను ఉద్యోగంలో పెట్టిన ప్లేస్‌మెంట్ ఏజెన్సీ యాజమాన్యం కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఈ కేసు వెలుగులోకి వచ్చిన తరువాత దంపతుల ఇద్దరి ఉద్యోగాలు ఊడిపోయాయి.

మంచి ఉద్యోగాలు చేస్తున్న దంపతులు

మంచి ఉద్యోగాలు చేస్తున్న దంపతులు

మైనర్ బాలిక పనిచేస్తున్న ఇంటి యజమాని అయిన మహిళ కమల్ జీత్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా పనిచేస్తోంది, మేడమ్ ను ఆ సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది. కమల్ జీత్ భర్త మనీష్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని, అతడిని కూడా ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించిందని, దంపతులకు తగిన గుణపాఠం చెప్పాయని అధికారులు అంటున్నారు.

ట్విట్టర్ పోస్టు చేస్తే మ్యాటర్ లీక్ అయ్యింది

ట్విట్టర్ పోస్టు చేస్తే మ్యాటర్ లీక్ అయ్యింది

దీపికా నారాయణ్ భరద్వాజ్ అనే వ్యక్తి ఆయన ట్విటర్‌లో ఆ అమ్మాయి ఫోటోతో పాటు దంపతుల నుంచి ఆ అమ్మాయికి ఎదురైన కష్టాలను వెల్లడించారు. అతను ట్విట్టర్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, అతను ఆసుపత్రిలో అమ్మాయిని కలుసుకున్నాడు. శాడిస్టు దంపతులు తనపై చేసిన హింసను ఆమె ఊహించలేకపోయిందని వివరించాడు.

సక్రమంగా అమ్మాయి పని చేయడం లేదని ఆరోపిస్తూ దంపతులు ఇద్దరూ బ్లేడు, హాట్ టంగ్స్‌తో దాడి చేశారని, బాధితురాలి శరీరమంతా గాయాలయ్యాయని, చాలా నెలలుగా ఉద్యోగం చేస్తున్నా ఈ దంపతులు అమ్మాయికి ఒక్క రూపాయి కూడా జీతం ఇవ్వలేదని దీపికా నారాయణ్ భరద్వాజ్ వివరించారు.

దిమ్మతిరిగిపోయింది

దిమ్మతిరిగిపోయింది

వేధింపులకు గురైన దంపతులను మనీష్‌, కమల్‌జీత్‌గా పోలీసులు గుర్తించారు. మనీష్ మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తుండగా, అతని భార్య కమల్‌జీత్ మంత్ర మీడియాలో పీఆర్‌ఓ ఆఫీసర్ గా పనిచేస్తున్నదని పోలీసులు అన్నారు.

దంపతులకు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడని, ఆ బిడ్డను చూసుకోవడానికి ఈ 17 ఏళ్ల అమ్మాయిని పనిలో పెట్టుకున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. సఖి సెంటర్ అనే స్వచ్చంద సంస్థకు చెందిన పింకీ మాలిక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దంపతులను అరెస్ట్ చేశారు. బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

నరకం చూపించారని చెప్పిన అమ్మాయి

నరకం చూపించారని చెప్పిన అమ్మాయి

అమ్మాయి చేతులు, పాదాలు, నోరు, ముఖం ప్రతిచోటా గాయాలయ్యాయని పోలీసులు అన్నారు. మొదట ఆమెకు 14 ఏళ్లు అని చెప్పారు. అయితే బాలిక వయసు 17 ఏళ్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ శాడిస్టు దంపతులు అమ్మాయికి సరిగ్గా భోజనం కూడా పెట్టలేదని, రాత్రి నిద్రపోనివ్వడం లేదని, ముఖం మీద తీవ్రగాయాలు కావడంతో ఆమె పెదవులు ఉబ్బిపోయాయని, శరీరమంతా గాయాలున్నాయని సఖి సెంటర్‌కు చెందిన పింకీ మాలిక్‌ స్థానిక మీడియాకు తెలిపారు.

ఐదు నెలల క్రితం బాలిక మేనమామ తనను తీసుకొచ్చి దంపతులు ఉండే ఇంట్లో వదిలేశారని ఎఫ్‌ఐఆర్‌లో బాలిక పేర్కొంది. మనీష్, కమల్ జీత్ దంపతులు తనను ప్రతిరోజు హింసించి నరకం చూపించారని విచారణలో బాధితురాలు చెప్పిందని పోలీసులు తెలిపారు.

అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ మీద దాడి

అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ మీద దాడి

నిందితులు తనను వివస్త్రను చేసి తన వ్యక్తిగత భాగాలపై దాడి చేశారు. దంపతులు ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లనివ్వలేదని, కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు కూడా అనుమతించలేదని బాలిక చెప్పడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని పోలీసులు అన్నారు, శాడిస్టు దంపతులను పోక్సో చట్టం కింద అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+