8వ తరగతి అమ్మాయితో స్కూల్ బస్సు డ్రైవర్ అంకుల్ ఏం చేశాడంటే?, న్యూఇయర్ రోజు షాక్!
తల్లి తన కూతురిని స్కూల్ బస్సులో పంపించి, ఆమె సురక్షితంగా పాఠశాలకు వెళ్లేలా చేసింది. అయితే బస్సు డ్రైవర్ అంకుల్ తన కుమార్తె వయస్సు ఉండే 8వ తరగతి విద్యార్థినితో ప్రేమలో పడ్డాడు. తరువాత అమ్మాయిని ఆమె ఇంటి నుండి తీసుకెళ్లి కొత్త సంవత్సరం రోజున రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అంకుల్ తో ప్రేమలో పడిన 14ఏళ్ల అమ్మాయి జీవితం ముగిసిపోయింది.
అంకుల్ తో ప్రేమలో పడిన మైనర్ అమ్మాయి ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్ణాటకలోని చిక్కమగళూరులో జరిగింది. స్కూల్ బస్సు డ్రైవర్ ప్రేమ వ్యవహారానికి ఓ విద్యార్థిని బలి అయ్యింది. 8వ తరగతి విద్యార్థినితో కలిసి స్కూల్ బస్సు డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చిక్కమంగళూరులోని అజ్జంపూర్ సమీపంలోని బంకనకట్టె సమీపంలో చోటుచేసుకుంది. రైలుకు అడ్డంగా నిలబడి డ్రైవర్ సంతోష్ (38), విద్యార్థిని జానవి (14) అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నారు.

గిరియాపూర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న జానవియన్ అలియాస్ జానవి అనే విద్యార్థినిని పాఠశాల బస్సు డ్రైవర్ సంతోష్ ప్రేమలో పడేలా వేధించాడని సమాచారం. ఈ విషయాన్ని విద్యార్థిని జానవి తన తల్లిదండ్రులకు ఇంట్లో చెప్పింది. వెంటనే తల్లిదండ్రులు కూడా బస్సు డ్రైవర్ సంతోష్ వేధింపుల గురించి స్కూల్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. గత మూడేళ్లుగా ఆ ప్రైవేట్ స్కూల్‌లో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్న సంతోష్ నిత్యం అమ్మాయిలను వేధిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.
విద్యార్థి జానవి తల్లిదండ్రులు వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఆమెను స్నేహానికి పిలిచి సాన్నిహిత్యం పెంచుకున్నాడు కిరాతకుడు సంతోష్. న్యూఇయర్ ఫస్ట్ సోమవారం రోజు జానవి తన స్నేహితులతో కలిసి న్యూ ఇయర్ పార్టీకి వెళ్తానని. కేక్ కట్ చేసిన తరువాత వస్తానని ఇంట్లోని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చింది. తురువాత సంతోష్ స్కూల్ అమ్మాయి జానవిని పిలుచుకుని వెళ్ళాడు.
అయితే జానవిని తన వెంట తీసుకెళ్లిన సంతోష్ అర్ధరాత్రి వరకు ఆమెను వివిద ప్రాంతాల్లో తిప్పాడు. తరువాత రైల్వే ట్రాక్ మీద నిలబడి వేగంగా వస్తున్న రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ ఘటన ఎవరూ చూడకపోవడంతో మంగళవారం వేకువ జామున ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అటువైపు వెలుతున్న ప్రయాణికులు రైల్వే ట్రాక్ మీద చెల్లాచదురుగా పడి ఉన్న ఇద్దరి శవాలు చూసి హడలిపోయారు.
పాఠశాలలో బస్సు డ్రైవర్ సంతోష్ పై ఫిర్యాదు చేసినా పాఠశాల యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థిని జానవి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే ట్రాక్ దగ్గర చెల్లాచెదురుగా పడి ఉన్న ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిక్కమగళూరులోని మల్లగౌడ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన చిక్కమగళూరు జిల్లా అజ్జంపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications