ప్రియుడు ఫీల్ అవుతున్నాడని భర్తను చంపిన లేడీ స్కూల్ టీచర్, పిల్లలతో కూడా !

చెన్నై/సేలం: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు కొడుకు ఉన్నాడు. సినిమా హీరోయిన్ లా ఉన్న భార్య అంటే ఆమె భర్త పడిచచ్చిపోయాడు. వ్యాపారం చేస్తున్న భర్త భారీగా సంపాధిస్తున్నాడు. స్కూల్ టీచర్ గా పని చేస్తున్న భార్యకు ఓ స్నేహితురాలి కారణంగా పరిచయం అయిన యువకుడితో అక్రమ సంబందం పెట్టుకుంది. తరువాత ప్రియుడు పీల్ అవుతున్నాడని భర్తను పక్లాప్లాన్ తో చంపేసిన భార్య ఓ సినిమా స్టోరీ చెప్పింది.

తమిళనాడులోని సేలం జిల్లాలోని మెట్టూరులోని జలకందపురంలో సుందర్‌రాజ్ ( 32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం సందుర్ రాజ్ కు పెళ్లి జరిగింది. సుందర్ రాజ్ భార్య పేరు నివేదిత (28). ఈ దంపతులకు ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. కొంతకాలం సుందర్ రాజ్ బెంగళూరులోనే ఉన్నాడు. బెంగళూరులో పని చేసే సుందర్‌రాజ్ ఐదేళ్ల క్రితం స్వగ్రామానికి వచ్చి పవర్ లూమ్ వ్యాపారం ప్రారంభించాడు.

illeagalaffair1
ఈ క్రమంలో జూలై 17న తెల్లవారుజామున 4 గంటలకు సుందర్ రాజ్ ఇంట్లో ఫ్యాన్ కు వేలాడుతూ శవమై కనిపించాడు. అతని భార్య నివేదిత బంధువులకు, పోలీసులకు సమాచారం అందించింది. ఈ మేరకు జలగండాపురం పోలీస్ స్టేషన్ పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మెట్టూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా ఉరి వేసుకున్నట్లుగా మెడకు వేలాడుతూ ఊపిరాడక మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. దీంతో సుందర్ రాజ్ భార్య నివేదితపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో సుందర్ రాజ్ భార్య నివేదితను అదుపులోకి తీసుకున్న పోలసులు ఆమెను విచారించగా మ్యాటర్ బయటకు వచ్చింది. తన భర్త సుందర్ రాజ్ ముఖం మీద దిండుతో నొక్కే హత్య చేసినట్లు భార్య నివేదిత అంగీకరించింది.

సుందర్‌రాజ్‌ భార్య నివేదిత మెట్టూరు పట్టణంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో లీచర్ గా పనిచేస్తుంది. పాఠశాల స్నేహితురా విద్య ఓసారి వీడియో కాల్ లో దినేష్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ నేపథ్యంలో దినేష్, నివేదిత మధ్య పరిచయం ఏర్పడి స్నేహితులయ్యారు. కాలక్రమేణా వివాహిత మహిళ నివేదిత దినేష్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న సుందర్‌ రాజ్ నివేదితను చితకబాది ఆమె స్కూల్ కు వెళ్లకుండా చేసి ఆమె నుంచి సెల్‌ఫోన్ లాక్కొన్నాడు.

illeagalaffair1
తనను స్కూల్ కు పంపించలేదని, సెల్ ఫోన్ లాక్కొన్నాడనే కోపంతోనే తన భర్త సుందర్ రాజ్ ను చంపేందుకు ప్లాన్ చేశానని నివేదిత పోలీసుల విచారణలో అంగీకరించిందని సమాచారం. బంధువులను కలవడానికి అత్తామామ ఇద్దరూ బెంగళూరు వెళ్లారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నివేదిత ఆమె స్నేహితురాలు విద్యా, ప్రియుడు దినేష్ సహాయంతో సుందర్‌ రాజ్‌కి నిద్రమాత్రలు ఇచ్చింది.

రాత్రి నిద్రమాత్రలు కలిపిన భోజనం తిన్న సుందర్ రాజ్ బెడ్ రూమ్ లో నిద్రపోయాడు. తరువాత సుందర్ రాజ్ కొడుకు మరో గదిలో నిద్రపోయాడు. తరువాత నివేదిత. దివ్య. దినేష్ కలిసి దిండుతో భర్త సుందర్ రాజ్ ముఖం నొక్కేసి హత్య చేశారు. ముగ్గురు వ్యక్తులు కలిసి సుందర్ రాజ్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని చిత్రీకరించారని విచారణలో తేలిందని పోలీసులు అన్నారు. సుందర్ రాజ్ హత్య కేసులో అతని భార్య నివేదిత, ఆమె ప్రియుడు దినేష్, మరో లేడీ టీచర్ విద్య అనే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+