మైనింగ్ మాఫియా, సీనియర్ లేడీ ఆఫిసర్ దారుణ హత్య, రాత్రి ఇంట్లో ఏం జరిగింది ?. ఫోన్ లో!

Mining mafia: కర్ణాటక మైన్స్ అండ్ జియాలజీ శాఖలో పనిచేస్తున్న ప్రతిమా కెఎస్ అలియాస్ ప్రతిమా (45) బెంగళూరులోని సుబ్రహ్మణ్యపురలోని ఆమె ఇంట్లో దారుణ హత్యకు గురైంది. ఈ కేసు ఇప్పుడు కర్ణాటక రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రతిమా హత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. దీని వెనుక రియల్ ఎస్టేట్ మాఫియా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు.

ప్రతిమా హత్యకు గల అసలు కారణం విచారణ తర్వాతే తేలనుందని పోలీసు అధికారులు అంటున్నారు. అయితే ప్రతిమా సహోద్యోగి ఒకరు కన్నడ మీడియాకు ఇచ్చిన స్టేట్‌మెంట్ కేసును మలుపు తిప్పింది. కర్ణాటక పర్యావరణ శాఖ సీనియర్ అధికారి ఒకరు విలేకరులతో మాట్లాడుతూ ప్రతిమా చాలా చురుకైన మహిళ అని, ఆమె కష్టపడి పనిచేయడం వల్లే డిపార్ట్‌మెంట్‌లో మంచి పేరు తెచ్చుకుందని చెప్పారు.'

 A senior woman official of the Karnataka Mines Department was brutally murdered in Bengaluru

ప్రతిమా చాలా ధైర్యవంతురాలు, అక్రమ గనుల మీద దాడి చెయ్యడానికి, వారి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ఆమె ఇంత వరకు వెనుకాడలేదు అని అన్నారు. ప్రతిమా చాలా ధైర్యవంతురాలిగా డిపార్ట్‌మెంట్‌లో మంచి పేరు తెచ్చుకుందని, ఇటీవల కొన్ని చోట్ల దాడులు నిర్వహించిందని ఆశాఖకు చెందిన సీనియర్ అధికారి దినేష్ విలేకరులతో అన్నారు. ప్రతిమాకు శత్రువులు ఎవరూ లేరని, కొత్త నిబంధనల ప్రకారం ఆమె తన పనిని చక్కగా చేసిందని, దాని వల్ల ఆమెకు డిపార్ట్‌మెంట్‌లో మంచి పేరు వచ్చిందని దినేష్ తెలిపారు.

బెంగళూరు గ్రామీణ ప్రాంతంలో ఉద్యోగం చేసే ప్రతిమా శివమొగ్గలోని ఓ కాలేజీలో ఎంఎస్సీ చేసింది. బెంగళూరు సమీపంలోని రామనగర కార్యాలయంలో ఏడాదిపాటుగా ప్రతిమా ఉద్యోగం చేస్తున్నదని పోలీసులు అంటున్నారు. శనివారం సాయంత్రం కార్యాలయంలో పని ముగించుకున్న ప్రతిమాను ఆమె డ్రైవర్ బెంగళూరులోని సుబ్రమణ్యపురలోని ఆమె ఇంటికి దింపాడు.

రాత్రి 8. 30 గంటల సమయంలో ప్రతిమా ఇంటికి వెళ్లింది. తరువాత ప్రతిమా హత్యకు గురైనట్లు సమాచారం. ఆదివారం ప్రతిమా సోదరుడు ఆమె ఇంటికి వచ్చి చూడగా ఆమె శవమై కనిపించింది. శనివారం రాత్రి ప్రతిమాకు ఆమె సోదరుడు ఆమెకు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదని, తరువాత అతను పోలీసులకు సమాచారం అందించాడని అధికారులు అంటున్నారు.

పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ఫోరెన్సిక్, సాంకేతిక బృందాలు ప్రతిమా హత్యకు గురైన ప్రాంతంలో ఆధారాలు, సమాచారాన్ని సేకరించారు. విచారణ కోసం మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతిమా హత్యకు కచ్చిమైన కారణాలు తెలియడం లేదని, పలు కోణాల్లో విచారణ జరుగుతోందని, పూర్తి సమాచారం తెలిసిన తరువాత అసలు విషయం తెలుస్తుందని, అంత వరకు ప్రతిమా హత్యకు సంబంధించి వివరాలు చెప్పలేమని బెంగళూరు పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+