పాక్ సైనికుల తలను తెస్తే రూ.5 కోట్లిస్తామంటూ ముస్లిం సంస్థ సంచలనం
పాకిస్తాన్ సైనికుల తల నరికిన భారత జవాన్లకు రూ.5 కోట్ల రివార్డును ఇస్తామని ముస్లిం యువ ఆటంకవాడి విరోధి సమితి ప్రకటించింది.పాక్ సైనికులు ఇటీవల భారత సైనికులను అతిదారుణంగా నరికిచంపారు.
జైపూర్: పాకిస్తాన్ సైనికుల తల నరికిన భారత జవాన్లకు రూ.5 కోట్ల రివార్డును ఇస్తామని ముస్లిం యువ ఆటంకవాడి విరోధి సమితి ప్రకటించింది. పాక్ సైనికులు ఇటీవల భారత సైనికులను అతిదారుణంగా నరికిచంపారు.
భారత సైనికుడు పరమ్ జిత్ సింగ్ తలను పాకిస్తాన్ సైనికులు నరికిన నేపథ్యంలో పాక్ సైనికుల తల నరికి తీసుకురావాలని రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలోని ముస్లిం సంస్థ సంచలన ప్రకటన చేసింది.

ముస్లిం యువ ఆటంకవాది విరోధి సమితి అధ్యక్షుడు మహమ్మద్ షకీల్ అజ్మీర్ దర్గా.ను సందర్శించాడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పాక్ సైనికుల తల నరికి తెచ్చిన భారత జవాన్లకు రివార్డు ఇచ్చేందుకు వీలుగా తాము తమ సంస్థ వలంటీర్లు, ప్రజల నుండి విరాళాలు వసూలు చేస్తున్నట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications