యూఎస్ వెళ్లాలనుకునే వారికి షాక్ .. 2026నుండి పెరగనున్న టూరిస్ట్ వీసా ఛార్జీలు!

యూఎస్ వెళ్లాలనుకునే పర్యాటకులకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చారు. యునైటెడ్ స్టేట్స్ టూరిస్ట్ వీసా బి1 / బి2 చార్జీల పెంపుతో 2026 సంవత్సరంలో యూఎస్ వెళ్లాలనుకునే భారత పర్యాటకుల జేబులు ఖాళీ చేసే విధానానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈటీవీలో యునైటెడ్ స్టేట్స్ టూరిస్ట్ వీసా చార్జీల పెంపు అంశం అంతర్జాతీయ ప్రయాణికులలో ముఖ్యంగా భారతీయులలో పెద్ద చర్చకు కారణంగా మారింది.

వీసా ఇంటిగ్రిటీ ఫీ అనే అదనపు ఛార్జ్ కారణంగా ఈ పెంపు
కొత్తగా ప్రతిపాదించిన వీసా ఇంటిగ్రిటీ ఫీ కారణంగా ఈ పెంపు జరుగుతున్నట్టు తెలుస్తోంది. యూఎస్ ప్రభుత్వం వీసా ఇంటిగ్రిటీ ఫీ అనే అదనపు ఛార్జ్ కారణంగా ఈ పెంపు చేస్తోంది. వీసా నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చేయడానికి వీసా గడువు మించి ఉంటే ఓవర్ స్టే ప్రయాణాలను తగ్గించడం ఇది ఒక ప్రధాన ఉద్దేశం.

A shock for those planning to go to the US Tourist visa fees are set to increase from 2026

2026 ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి వచ్చే సూచనలు
ఇది సుమారు 250డాలర్ల వరకు ఉండవచ్చని చెబుతున్నారు అంటే ప్రస్తుతం ఉన్న వీసా ఫీజుతో కలిపి ఈ మొత్తం ఖర్చు 400డాలర్లకు పైగా ఇండియన్ కరెన్సీలో 35వేల నుంచి 40వేల వరకు చేరే అవకాశం ఉంది. ఇది చార్జీల పెంపు ప్రధానంగా 2026 ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అయితే దీనికి సంబంధించి ఖచ్చితమైన తేదీని యూఎస్ ప్రభుత్వం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

ఇప్పుడు దరఖాస్తు చేస్తేనే మంచిదని సలహా
2025 చివరి వరకు కొత్త నిబంధనలు అమలులోకి వచ్చేలోపు వీసాకు దరఖాస్తు చేస్తే అదనపు ఫీజులు తగ్గించుకునే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. యూఎస్ వెళ్లాలనుకునేవారికి ఈ పెంపు కొంత భారంగా మారే అవకాశం ఉంది. అయినప్పటికీ వీసా నిబంధనలను పాటిస్తూ సమయానికి తిరిగి వచ్చే వారికి భవిష్యత్తులో కొంతమేర రిఫండ్ లేదా మినహాయింపులు ఉండవచ్చని చర్చ జరుగుతుంది.

ఈ నెలలో దరఖాస్తు చేస్తే ఆర్ధిక భారం నుండి మినహాయింపు
యూఎస్ టూరిస్ట్ వీసాల చార్జీల పెంపు దాదాపు ఖాయమనే భావన బలపడుతున్న క్రమంలో ఎవరైనా యూఎస్ వెళ్లాలనుకునేవారు ఈ నెలలోనే దరఖాస్తు చేసుకుంటే కొంత భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+