Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పర్యాటక కేంద్రంలో చిన్న చిప్స్ ప్యాకెట్ ఎంత పని చేసిందంటే, మొత్తం క్లోజ్ !

బెంగళూరు/మడికేరి: పర్యాటక కేంద్రాలు, విహారయాత్రల ప్రాంతాల్లో దుకాణాలు నిర్వహిస్తున్న వారు చెప్పిన రేటుకే మనం ఏమైనా తీసుకోవాలి. పర్యాటక కేంద్రాల్లో వాళ్లు చెప్పిందే వేదం. దూర ప్రాంతాల నుంచి వెళ్లిన వారి అవసరాలను గుర్తించిన అక్కడి వ్యాపారులు భారీ ఎత్తున అమాయకులైన పర్యాటకులను నిలువు దోపిడీ చేస్తున్నారని అనేకసార్లు వెలుగు చూసింది.

ఆదివారం రాత్రి కర్ణాటకలోని కొడగులో చిప్స్ కొనుగోలు చేస్తుండగా గొడవ జరగడంతో షాపు యజమానికి, చిప్స్ తీసుకోవడానికి వెళ్లిన వినియోగదారుడికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగినప్పటి నుంచి కొడగులోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రాజాసీట్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. దెబ్బకు ఆదివారం రాత్రి నుంచి మూడు రోజుల పాటు రాజసీట్ పర్యాటక ప్రాంతంలో మొత్తం దుకాణాలు మూసివేయాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా యంత్రాంగం ఆదేశాలతో అన్ని దుకాణాలు మూసివేశారు.

 tourist

ఒక చిన్న కారణంతో ఎలాంటి గొడవ జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కొడగులో కూడా చిప్స్ కొనుక్కోవడానికి వెళ్లిన వ్యక్తికి, షాపు యజమానికి మధ్య చిన్న గొడవ మొదలైయ్యింది. చివరికి ఈ గొడవ తారా స్థాయికి చేరుకుంది. మడికేరి రాజాసీట్‌లో నిన్న రాత్రి దుకాణదారుడు జంషాద్ షాపులోకి వెళ్లిన సెక్యూరిటీ గార్డు జయన్న చిప్స్ ప్యాకెట్ కావాలని చెప్పాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

ఇంతలో షాపు యజమాని ఇనుపరాడ్ తీసుకుని సెక్యూరిటీ గార్డు జయన్న తలపై బలంగా దాడి చేశారు. జయన్న తలకు తీవ్రగాయాలు కావడంతో అతను అక్కడే కుప్పకూలిపోయాడు. పక్కషాపుల దగ్గర ఉన్న వాళ్లు అక్కడి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయిన తీవ్రగాయాలైన సెక్యూరిటీ గార్డు జయన్నను సాటి పర్యాటకులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.

 tourist

స్థానికంగా ప్రాథమిక చికిత్స అందించి తదుపరి చికిత్సను మైసూరుకు పంపించారు. ప్రస్తుతం సెక్యూరిటీ గార్డు జయన్న మైసూరులోని జేఎస్ఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి విషమంగానే ఉందని పోలీసులు అంటున్నారు. సెక్యూరిటీ గార్డు జయన్నపై దాడి చేసిన వ్యక్తిని జంషాద్‌గా గుర్తించామని పోలీసులు అన్నారు.

చిప్స్ కొనుగోలు విషయంలో జరిగిన గొడవ చివరికి హత్యాయత్నానికి పాల్పడే వరకు వెళ్లిందని జంషాద్ ను అరెస్టు చేశామని మడికేరి పోలీసులు తెలిపారు. జంషాద్‌ను అదుపులోకి తీసుకోవడంతో రాజాసీట్ పర్యాటక ప్రదేశంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రాజాసీట్ ముందు ఉన్న దుకాణాలన్నింటినీ జిల్లా యంత్రాంగం మూసివేసింది. ఈ ప్రాంతానికి కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది పర్యాటకులు ప్రతిరోజు వెళ్లి వస్తుంటారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+