అమ్మాయిలతో లిక్కర్ పార్టీ, 33వ అంతస్తు టెర్రాస్ లో ఏం జరిగింది, టెక్కీ జీవితం !
ఐటీ హబ్ బెంగళూరులో కొందరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు వీకెండ్ లో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక ఫ్రెండ్స్ ఒకే చోట కలిస్తే ఆ పార్టీ వీరలెవల్లో ఉంటుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫ్రెండ్స్ తో కలిసి ఉదయం వరకు మందు పార్టీ చేసుకున్నారు. అమ్మాయిలతో కలిసి మందు పార్టీ జరుపుకుంటున్న సమయంలోనే ఓ టెక్కీ 33వ అంతస్తు మీద నుంచి కిందపడిపోవడంతో అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
ఉత్తరప్రదేశ్ కు చెందిన దీపాంశు శర్మా (27) అనే యువకుడు బెంగళూరు చేరుకుని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బెంగళూరులోని ఓ పీజీ సెంటర్ లో దీపాంశు శర్మా ఉంటూ ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్లి వస్తున్నాడు. బెంగళూరులోకి కేఆర్ పురం సమీపంలోని అయ్యప్పనగరలోని కొడిగేహళ్ళిలోని అపార్ట్ మెంట్ లో దీపాంశు శర్మా స్నేహితులు నివాసం ఉంటున్నారు.

గురువారం రాత్రి దీపాంశు శర్మా కొడిగేళ్ళిలోని స్నేహితులు నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లోకి వెళ్లాడు. తరువాత స్నేహితులతో కలిసి దీపాంశు శర్మా లిక్కర్ పార్టీ చేసుకున్నారని తెలిసింది. దీపాంశు శర్మతో పాటు ఇద్దరు యువతులు, మరి కొందరు స్నేహితులు లిక్కర్ పార్టీలో ఉన్నారని సమాచారం. ఉదయం 6.30 గంటల వరకు దీపాంశు శర్మా తదితరులు మద్యం సేవిస్తున్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది.

తరువాత అపార్ట్ మెంట్ లోని 33వ అంతస్తులోని బాల్కనిలోకి వెళ్లిన దీపాంశు శర్మా అక్కడి నుంచి కిందపడిపోయాడు. 33వ అంతస్తు మీద నుంచి కిందపడిపోవడంతో తీవ్రగాయాలైన దీపాంశు శర్మా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని కేఆర్ పురం పోలీసులు చెప్పారు. దీపాంశు శర్మాతో పాటు అతని స్నేహితులు లిక్కర్ తో పాటు గంజాయి సేవించారని అనుమానం ఉందని పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని దీపాంశు శర్మా కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, దీపాంశు శర్మా స్నేహితులను విచారణ చేస్తున్నామని కేఆర్ పురం పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications