తల్లి ప్రియుడిని వెంటాడి చంపేశాడు

చెన్నై: ప్రియుడితో కలిసి తన తల్లి రహస్యంగా తోటలో గడుపుతున్న దృశ్యాలను స్వయంగా చూసిన యువకుడు తట్టుకోలేకపోయాడు. తల్లి ప్రియుడిని వెంటాడి కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేసిన సంఘటన తమిళనాడులో జరిగింది.

తిరువరూర్ జిల్లాలోని దేవనూరు పుదూరులో శక్తివేలు (49), కలైసెల్వీ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి విశాంత్ అనే కుమారుడు ఉన్నాడు. శక్తివేలుకు మైలాడుంపారైలో తోట ఉంది. తరచూ శక్తివేలు తోట దగ్గరకు వెలుతుంటాడు.

మైలాడుంపారైలో ఆరుస్వామి, తాడగై (45) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి మురుగన్ (23) అనే కుమారుడు ఉన్నాడు. శక్తివేలు తోట దగ్గరకు వెళ్లే సమయంలో పక్క తోట యజమాని ఆరుస్వామి భార్య తాడగైతో పరిచయం ఏర్పడింది.

A son caught his mother red handed along with her lover

వీరి పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది. నిత్యం తోటలో వీరు గంటలు గంటలు ఏకాంతంగా గడిపేవారు. సోమవారం శక్తివేలు, తాడగై తోటలో రహస్యంగా గడుపుతున్నారు. అటు వైపు వెళ్లిన మురుగన్ కు చప్పుడు వినిపించింది.

అక్కడికి వెళ్లి చూడగా తన తల్లి ప్రియుడితో కలిసి ఉన్న చూడరాని దృశ్యాలను చూసి తట్టుకోలేకపోయాడు. మురుగన్ ను చూసిన శక్తివేలు, తాడగై అక్కడి నుంచి పరుగు తీశారు. అయితే మురుగన్ శక్తివేలును వెంటాడి కత్తితో పోడిచి దారుణంగా హత్య చేశాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు మురుగన్ ను అరెస్టు చేశారు. తన తల్లితో అక్రమ సంబంధం సాగిస్తున్నందుకే తాను శక్తివేలును అంతం చేశానని మురుగన్ విచారణలో అంగీకరించాడని దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+