ఆంటీతో అక్రమ సంబంధం, అడ్డుపడుతున్న తల్లిదండ్రులను ఏం చేశాడంటే ?
బెంగళూరు/హాసన్: వివాహం చేసుకున్న దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరు కొడుకులకు ఏలోటు లేకుండా చూసుకున్నారు. విధవతో అక్రమ సంబంధం పెట్టుకుని చెడుఅలవాట్లకు బానిస అయిన కొడుకు అతని విలాసాలకు అడ్డుపడుతున్న తల్లిదండ్రులు ఒకేసారి పక్కాప్లాన్ తో చంపేశాడు. అంత్యక్రియలకు అర్దగంట ముందు అతని బండారం బయటకు వచ్చింది.
కర్ణాటకలోని హాసన్ జిల్లా అరకలగూడు తాలూకా బిసిలహళ్లి గ్రామంలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై దంపతుల మృతికి అసలు కారణం పోలీసుల విచారణలో బయటకు రావడం హాట్ టాపిక్ అయ్యింది. దంపతుల మృతి మిస్టరీ బయటకు రావడంతో హంతకుడు షాక్ అయ్యాడు. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన దంపతులు చికిత్స పొందిన తరువాత ఇంటికి వెళ్లి మృతి చెందారు.

కన్న కొడుకు అతని తల్లిదండ్రులకు విషం ఇచ్చి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. హాసన్ జిల్లా అరకలగూడు తాలూకా బిసిలహళ్లి గ్రామంలో ఉమా(48), నంజుండప్ప(55) అనే అభాగ్యులు అతని కొడుకు చేతిలోనే హత్యకు గురైనారు. దంపతుల కొడుకు మంజునాథ్(27) తల్లిదండ్రులను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉమా, నంజుండప్ప దంపతులకు మంజునాథ్ రెండో కుమారుడు.
మంజునాథ్ ఓ విధవతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. కుమారుడు మంజునాథ్ అక్రమ బంధంపై అతని తల్లి ఉమా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వచ్చింది. అప్పుడప్పుడు కొడుకు మంజునాథ్ కు ఉమా బుద్ది మాటలు చెబుతుండేదని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
తల్లి ఉమా సహకార సంఘాల్లో అప్పు చేసి కొడుకు మంజునాథ్ కు వ్యాపారం చెయ్యమని డబ్బును ఇచ్చిందని, అయితే అతను ఆ డబ్బు దుర్వినియోగం చేశాడని, అక్రమ సంబంధం పెట్టుకున్న ఆంటీకి ఆ డబ్బులు ఇచ్చాడని తెలిసింది. తల్లి ఉమా పదే పదే డబ్బులు తిరిగి తెచ్చి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు నువ్వు అక్రమ సంబంధాన్ని వదులుకోవాలని కొడుకు మంజునాథ్ ను హెచ్చరించింది.

దీంతో కోపోద్రిక్తుడైన నిందితుడు మంజునాథ్ అతని తల్లిని హత్య చేసేందుకు పథకం పన్నాడని సమాచారం. ఆగస్టు 15న ఇంట్లో తల్లి ఉమా టిఫిన్ కు పలావ్ చేసింది. నిందితుడు మంజునాథ్ తన తండ్రి, తల్లి కంటే ముందే పలావ్ తినేసి తరువాత ఆ పలావ్ లో పురుగుల మందు కలిపేశాడు.
అమ్మానాన్న పలావ్ తినగానే వాంతులు చేసుకున్నారు. తరువాత మంజునాథ్ కూడా పలావ్ లో మందు వాసన వచ్చిందని అందరికి చెప్పి వాంతులు చేసుకున్నట్లు నటించాడు. ఆగస్టు 15న ఇంట్లో అల్పాహారం తీసుకున్న దంపతులు అస్వస్థతకు గురయ్యారు. గత గురువారం చికిత్స పొందిన తరువాత ఇంటికి తిరిగి వెళ్లిన తరువాత దంపతులు ఇద్దరూ గంట వ్యవధిలో ఆకస్మికంగా మృతి చెందారు.
దీంతో అనుమానం వచ్చిన మరో కుమారుడు తమ్ముడు మంజునాథ్ కు తెలీకుండా అతని తల్లిదండ్రులు ఉమా, నంజుండప్పల మృతిపై పోలీసులకు సమాచారం అందించాడు. గురువారం సాయంత్రం అంత్యక్రియలకు సన్నాహాలు చేస్తుండగా క్లైమాక్స్ లో గ్రామానికి చేరుకున్న పోలీసులు దంపతుల అంత్యక్రియలు చెయ్యడానికి వీలు లేదని చెప్పి అంత్యక్రియలను చివరి నిమిషంలో నిలిపివేశారు.
దంపతుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు కుటుంబ సభ్యులను ఒప్పించారు. ఆదివారం సాయంత్రం పోస్టుమార్టం నివేదిక వచ్చింది. అప్పటికే అసహజ మృతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తరువాత పోలీసులు మంజునాథ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తన తల్లిదండ్రులకు తానే విషం పెట్టి హత్య చేశానని అంగీకరించాడని పోలీసులు అన్నారు. హాసన్ జిల్లాలోని కోననూరు పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. విధవతో అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్న తల్లిదండ్రులకు కన్న కొడుకు విషం పెట్టి హత్య చెయ్యడం కలకలం రేపింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications