డీకే శివకుమార్ మీద సీబీఐ కేసు, కోర్టు ఏం చెప్పిందంటే, ఎన్నికల సమయంలో బిగ్ రిలీఫ్ !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన తరువాత కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ వస్తే సీఎం అభ్యర్థి రేసులో ఉన్న కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. డీకే. శివకుమార్ మీద నమోదు అయిన కేసులో విచారణ చేస్తున్న సీబీఐ విచారణను కొంతకాలం పాటు హైకోర్టు వాయిదా వేసింది.
ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు సంపాధించారని ఆరోపిస్తూ కనకపుర అసెంబ్లీ నియోజక వర్గం అభ్యర్థి, మాజీ మంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ మీద కేసు నమోదు అయ్యింది. డీకే. శివకుమార్ మీద నమోదు అయిన కేసును సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. తన మీద నమోదు అయిన కేసు విచారణను నిలిపి వేయాలని కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.

ఇప్పటికే డీకే. శివకుమార్ మీద నమోదు అయిన కేసు విచారణను తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రత్యేక కోర్టు సీబీఐ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తన మీద నమోదు అయిన కేసు విచారణపై ఇచ్చిన స్టేని పొడగించాలని డీకే. శివకుమార్ మరోసారి ప్రత్యేక కోర్టుకు మనవి చేశారు. అసెంబ్లీ ఎన్నికల జరుగుతున్న సమయంలో డీకే. శివకుమార్ కు టెన్షన్ మొదలైయ్యింది.
సీబీఐ తరుపున న్యాయవాది ప్రసన్న కుమార్ ప్రత్యేక కోర్టులో వాదనలు వినిపించారు. డీకే. శివకుమార్ తరుపున ఆయన న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. ఇటీవల అర్జీ విచారణ పూర్తి అయ్యింది. వాదనలు విన్న హైకోర్టులోని ప్రత్యేక బెంచ్ న్యాయమూర్తి డీకే. శివకుమార్ కేసులో సీబీఐ విచారణకు ఇచ్చిన స్టే గడువును మే చివరి వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
మే చివరి వరకు సీబీఐ విచారణకు స్టే విధించడంతో మాజీ మంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు ఊపిరిపీల్చుకుని ఆయనపని ఆయన చేసుకోవడానికి అవకాశం చిక్కింది. సీబీఐ, ఈడీ కేసుల విచారణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీకే. శివకుమార్ చట్టపరంగా ఎవైనా ఇబ్బందులు ఎదురైతే కనకపుర నియోజక వర్గం నుంచి ఆయన తమ్ముడు డీకే, సురేష్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి గురువారం నామినేషన్ వేయించారు.












Click it and Unblock the Notifications