పొలిటికల్ పంచ్, ఓటు కోసం మాట మార్చిన సీఎం, కాలేజ్ అమ్మాయి కేసు కోసం స్పెషల్ కోర్టు!
గత వారం హుబ్బళిలో జరిగిన కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హీరేమఠ్ కుమార్తె నేహా హీరేమఠ్ హత్య కేసు విచారణ జాప్యం కాకూడదనే ఉద్దేశంతో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కర్ణాటక రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ తెలిపారు. మంగళవారం హుబ్బళిలోని నేహా హీరేమఠ్ ఇంటికి వెళ్లిన హెచ్‌కే పాటిల్ నేహా తండ్రి, కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హిరేమఠ్ ను ఓదార్చారు.
కర్ణాటక ప్రభుత్వం నుంచి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చెయ్యాలని హైకోర్టుకు లేఖ పంపుతామని మంత్రి హెచ్ కే పాటిల్ తెలిపారు. నేహా హత్య కేసులో దోషులను తగిన విధంగా శిక్షించాలి. అనివార్య కారణాల వల్ల ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాలేకపోయారని మంత్రి చెప్పారు. ఈరోజు ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా కార్పోరేటర్ నిరంజన్ హిరేమఠ్‌తో ఫోన్ లో మాట్లాడి నిరంజన్‌ను ఓదార్చారు. కూతురు నేహా హత్యపై తండ్రి నిరంజన్ హిరేమఠ్ స్పందించారు.

కాలేజ్ అమ్మాయి నేహా మృతికి త్వరలో న్యాయం జరుగుతుందని నేహా మృతికి త్వరలోనే న్యాయం జరుగుతుందని మంత్రి హెచ్ కే పాటిల్ విశ్వాసం వ్యక్తం చేశారు. హుబ్బళిలో జరిగిన ఈ పాశవిక హత్యతో ప్రజాసంఘాల నాయకుల సమావేశంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్ వచ్చింది. అందుకోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఇది వ్యక్తిగత ఘటన అంటూ హోంమంత్రి, సీఎం సిద్దరామయ్య చెప్పడంతో ప్రజా సంఘాలు, పతిపక్షాలు మండిపడుతున్నాయి.

సరైన సమాచారం లేకపోవడంతో సీఎం సిద్ధరామయ్య, హోంమంత్రి అలా మాట్లాడారని, తరువాత ఇద్దరూ సంజాయిషి ఇచ్చారని, తరువాత మా ప్రభుత్వం వెంటనే స్పందించిందని, ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి నేహా హత్య కేసు విచారణ త్వరగా పూర్తి చేస్తామని మంత్రి హెచ్ కే పాటిల్ తెలిపారు. ఇదే సమయంతో తన కూతురు నేహా హత్య కేసులో తమకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్ నిరంజన్ హీరేమఠ్ మీడియాకు చెప్పారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాలేజ్ అమ్మాయి నేహా హత్య కర్ణాటకలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications