Dog: గంటల వ్యవధిలో 29 మందిని కరిచిన కుక్క.. ఆ శునకానికి రేబిస్ పాజిటివ్..
దేశంలో కుక్క కాట్లు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ కుక్క ఒకే రోజు 29 మందిని కరిచింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. చెన్నైలో ఓ కుక్కు గంటల వ్యవధిలో 29 మందిని కుక్క కరిచింది. మంగళవారం రాత్రి జీఏ రోడ్డులో ఓ కుక్క కేవలం రెండు గంటల వ్యవధిలో ఐదుగురు పిల్లలతో పాటు మొత్తం 29 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గాయపడిన వారికి ప్రభుత్వ స్టాన్లీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స అందిచారు.
29 మందిని కరిచిన తర్వాత వీధి కుక్క పై ఆగ్రహంతో స్థానికులు దాన్ని కొట్టి చంపారు. అయితే వెటర్నరీ వైద్యులు కుక్క మృతదేహానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించారు. పోస్ట్ మార్టం రిపోర్టులో సంచనల విషయం బయటకొచ్చింది. 29 మందిని కరిచిన కుక్కకు రేబీస్ ఉందని తేలింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కుక్క దాడిలో గాయపడిన వారికి రేబీస్ వ్యాక్సిన్ ను ఇచ్చారు. బాధితులను అబ్జర్వేషన్ లో ఉంచినట్టు తెలిపారు.

ఈ ఘటనతో చెన్నై కార్పొరేషన్ యంత్రాంగం అప్రమత్తమైంది. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాయపురం ప్రాంతంలో ఉన్న కుక్కలను పట్టుకొని వాటికి టీకాలు చేయించారు. చెన్నై నగరంలో మొత్తం ఐదు యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాల ద్వారా కుక్కులకు టీకాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించారు. త్వరలో చెన్నై నగరంలో ఉన్న కుక్కల జనాభా గణన కూడా చేపట్టనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సోమవారం నుంచి కుక్కల గణన చేపట్టునున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ చెప్పారు.
చెన్నై నగరంలో పెద్ద సంఖ్యలో వీధి కుక్కలున్నట్లు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ వెల్లడించింది. వీధి కుక్కలకు టీకాలు వేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. 2023లో మొత్తం 17 వేలకు పైగా వీధి కుక్కులకు పట్టుకున్నామని తెలిపారు. వీటిలో 13 వేల కుక్కలను వైద్యం అందించినట్లు వివరించారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications