Sperm Count: మగవారికి డెంజర్ బెల్స్.. భారీగా తగ్గుతోన్న స్పెర్మ్ కౌంట్..
ఈ మధ్య సంతాన లేమి సమస్య పెరిగిపోతోంది. సంతానం లేక చాల జంటలు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. సంతానం కలగపోవడానికి ఆడ, మగ ఇద్దరూ కారణమవుతున్నారు. కొన్న జంటల్లో ఆడవారికి ప్రాబ్లమ్ ఉంటే.. మరి కొన్ని జంటల్లో మగవారికి ఇబ్బందులు ఉంటున్నాయి. ముఖ్యంగా మగవారిలో సంతానలేమి సమస్యలు పెరుగుతున్నట్లు ఓ అధ్యయనం పేర్కొంది. మగవారిలో శుక్రకణాల సంఖ్య తగ్గుతోన్నాట్ల అధ్యయనంలో తేలింది.
అయితే ఈ సమస్యం కేవలం తెలుగు రాష్ట్రాలోనే కాదు అలాగాని ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నట్లు తెలిసింది. మగవారిలో స్పెర్మ్ కౌంట్ పై హ్యూమన్ రీ ప్రొడక్షన్ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మగవారిలో శుక్రకణాల సంఖ్య 61 శాతానికి పడిపోయినట్లు తేలిందని సంస్థ ప్రకటించింది. ఈ సంస్థ 1973 నుంచి 2018 వరకు పలు పత్రికలు, మ్యాగజైలన్ల వచ్చిన కథనాలను విశ్లేషించింది.

అలాగే 53 దేశాల్లో 57 వేల మంది మగవారి వద్దు శుక్రకణాలన నమూనాలను కూడా సేకరించినట్లు సంస్థ పేర్కొంది. వాటిని విశ్లేషించింది. మగవారిలో శుక్రకణాల నాణ్యత 51.5 శాతానికి తగ్గిపోయినట్లు పేర్కొంది. స్పెర్మ్ కౌంట్ 62.3 శాతానికి పడిపోయినట్లు వెల్లడించింది. 1973 నుంచి రాను రాను పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తగ్గడమే కాదు.. వాటి నాణ్యత కూడా పడిపోతున్నట్లు విశ్లేషించింది. ఇలా శుక్రకణాల సంఖ్య తగ్గడానికి మనం తీసుకునే ఆహారం, అలవాట్లే కారణంగా తేల్చింది.
ఒత్తిడి, టెన్షన్ స్పెర్మ్ కౌంట్ తగ్గుతున్నట్లు అంచనా వేసింది. ప్రస్తుతం జంటలు ఎక్కువగా ఐయూఐ, ఐవీఎఫ్ పై ఆధారపడుతున్నారని వివరించింది. అందుకే పుట్టగొడుల్లా ఐపీఎఫ్ సెంటర్లు భారీగా పెరుగుతున్నట్లు చెప్పింది. శుక్రకాణాలు నాణ్యంగా ఉండి.. అధిక సంఖ్యలో ఉంటే.. స్త్రీలో గర్భాశంయంలోని ట్యూబ్ వద్ద ఉన్న ఎగ్ వద్ద వెళ్తాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications