surveyor: గర్వం, కొవ్వు. పక్కింటి వ్యక్తిని కత్తితో నరికిన సర్వేయర్, ప్రభుత్వం, భార్యను ?
చెన్నై/వేలూర్: రాజకీయ నాయకుల అండతో ప్రభుత్వ అధికారులు రెచ్చిపోతున్న వియషం తెలిసిందే. రౌడీలు సైతం రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ ప్రభుత్వ అధికారి, సర్వేయర్ ఉద్యోగం చేస్తున్ వ్యక్తి పక్కింటిలో నివాసం ఉంటున్న వారి మీద కత్తితో దాడి చేసి మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని సవాలు విసరడం కలకలం రేపింది.
తమిళనాడులోని వేలూరు జిల్లా (ఆంధ్రప్రదేశ్ సరిహద్దు)లోని రాణిపేట జిల్లా మేల్బాకం సమీపంలోని అరక్కోణంలోని ఈశ్వరన్ కోయిల్ వీధిలో నివాసం ఉండే అరుల్ (45) నెమిలిలో ల్యాండ్ సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. ఇంటి బయట డ్రెయిన్ నీళ్ల విషయంలో పక్క ఇంటికి చెందిన కరుణాకరన్ (55) కుటుంబీకుల మధ్య అరుల్ కు విబేధాలు తలెత్తినట్లు సమాచారం.

ఈ క్రమంలో మళ్లీ నీటి సేకరణ విషయంలో వివాదం తలెత్తడంతో అరక్కోణం టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని ల్యాండ్ సర్వేయర్ అరుల్ పక్కింటిలో నివాసం ఉంటున్న కరుణాకరన్‌ను బెదిరించాడు. కానీ పొరుగు ఇంటికి చెందిన కరుణాకరన్ మాత్రం ఫిర్యాదును ఉపసంహరించుకోనని చెప్పారు.
ఈ విషయమై నిన్న మరోసారి వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆవేశానికి లోనైన ల్యాండ్ సర్వేయర్ అరుల్ పక్కింటిలోని కరుణాకరన్ ను కత్తితో నరికాడు. కరుణాకరన్ భార్య తులసియమ్మాళ్‌పై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో కరుణాకరన్, ఆయన భార్య తులసియమ్మాళ్ తీవ్రంగా గాయపడి అరక్కోణం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అలాగే ల్యాండ్ ఇన్‌స్పెక్టర్ అరుల్, ఆయన భార్య ఓవియా కావాలనే అరక్కోణం ప్రభుత్వాసుపత్రిలో చేరి నాటకాలు ఆడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. పొరుగింటి వ్యక్తితో గొడవపడి అరక్కోణం టౌన్‌పోలీసులో ల్యాండ్ సర్వేయర్ అరుల్‌పై కేసు నమోదు కాగా, అరుల్ పొరుగింటి వ్యక్తిని కత్తితో నరికి చంపిన ఘటన అరక్కోణంలో సంచలనం రేపింది.












Click it and Unblock the Notifications