భార్య మీదకు స్వామీజీని రెచ్చగొట్టిన భర్త, లైంగిక దాడి, కోరిక తీర్చు, సుఖంగా ఉంటావు!

బెంగళూరు: భార్య మీదకు స్వామీజీని స్వయంగా రెచ్చిగొట్టించాడు ఓ భర్త. వివాహిత మహిళను ఓ ప్రముఖ స్వామీజీ లైంగిక వేధింపులకు గురి చేసి శారీరకంగా హించిన కేసులో స్వామీజీ శిష్యుడిని కర్ణాటకలోని మైసూరు నగరం పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు స్వామీజీ శిష్యుడు అనీల్ ఆచార్యను అరెస్టు చేశామని శుక్రవారం పొలీసులు చెప్పారు.

బాధితురాలి కథనం మేరకు సెప్టెంబర్ 4వ తేదీ అర్దరాత్రి 1 గంట సమయంలో తన భర్తతో పాటు స్వామీజీ, ఆయన శిష్యులు తన ఇంటికి వచ్చారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సందర్బంలో స్వామీజీ తన తలవెంట్రుకలు గట్టిగా పట్టుకుని దాడి చేశారని ఆరోపించింది.

తనను పూజించడానికి ఆశ్రమానికి ఎందుకు రావడంలేదని స్వామీజీ తనను కొట్టారని వివాహిత మహిళ ఆరోపించారు. తనను పూజించి సేవ చెయ్యడానికి రాను అంటూ ఎంత ధైర్యంగా చెబుతున్నావు అంటూ స్వామీజీ పురుషపదజాలంతో దూషించారని ఆరోపించారు.

A Swamiji of Mysore sexually harassed a woman. Swamijis disciple is now arrested

బెడ్ రూంలోకి వచ్చి తన కోరిక తీర్చితే నీకు జీవితంలో అంతా మంచి జరుగుతుందని స్వామీజీ తనను లైంగికంగా వేధించాడని మహిళ ఆరోపిస్తున్నది. ఆ సందర్బంలో తాను తప్పించుకోవడానికి ప్రయత్నించానని, స్వామీజీ, ఆయన శిష్యులు, నా భర్త కలిసి తన దుస్తులకు నిప్పంటించారని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఎదురింటికి వెళ్లి తలదాచుకుందామని ప్రయత్నిస్తే స్వామీజీ శిష్యులు బలవంతంగా తనను ఆయన కారులో ఎక్కించారని, మూడు రోజుల్లో ఆశ్రమానికి వచ్చి తనకు లైంగిక కోరిక తీర్చకుంటే నీ అంతు చూస్తానని స్వామీజీ బెదిరించాడని బాధితురాలు సెప్టెంబర్ 7వ తేదీ మైసూరు నగరంలోని కువెంపు నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు.

స్వామీజీ, తన భర్త, ఐదు మంది స్వామీజీ శిష్యులు తనపై లైంగిక దాడి చేసి శారీరకంగా హింసించారని వివాహిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు చేసిన వారిలో స్వామీజీ శిష్యుడు అనీల్ ఆచార్య ఉండటంతో అతన్ని అరెస్టు చేశారు. స్వామీజీ, మహిళ భర్త, మరో నలుగురు ఇంకా తప్పించుకుని తిరుగుతున్నారు.

Recommended Video

    fake Swamiji arrested : స్వామిజీ రతి లీలలు: భక్తుల భార్యల్ని రప్పించుకుని కామకేళి | Oneindia Telugu

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+