Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నిత్యానంద స్వామి దేశానికి తమిళ నటి ప్రధానమంత్రి ?, శిష్యురాలికి ప్రతి ఫలం, రేప్, కిడ్నాప్ కేసు !

Recommended Video

    Nithyanantha's Kailasa : A Tamil Actress Going To Be The Prime Minister || Oneindia Telugu

    చెన్నై/బెంగళూరు: నిత్యం ఏదో ఒక వివాదంలో ఉండే స్వామి నిత్యానంద ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపాడు. నిత్యానంద తన దేశానికి ఓ తమిళ నటిని ప్రధానమంత్రి చెయ్యాలని నిర్ణయించాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. నిత్యానంద దేశానికి తమిళ నటి ప్రధాని అవుతున్నారనే ఆ వార్త కలకలం సృష్టిస్తోంది. నిత్యానంద పేరు ఇప్పుడే కాదు చాల కాలం నుంచి వివాదంలో ఉంది. నిత్యానంద చాలా రాష్ట్రాల్లో ఆశ్రమాలు నడుపుతూ భోదకుడిగా, ఆయన శిష్యులకు గురువుగా చెలమాణీ అవుతున్నాడు. ఇప్పుడు మైనర్ అమ్మాయిలను కిడ్నాప్ చేశాడని ఆరోపణలు రావడంతో గుజరాత్ పోలీసులు నిత్యానందను అరెస్టు చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో దేశం విడిచిపారిపోయిన నిత్యానంద ఏకంగా దక్షిణ అమెరికా దేశం సమీపంలోని ఓ దీవిని సొంతంగా కొనేశాడని, దానికి కైలాస దేశంగా ప్రకటించుకున్నాడని, ఆ దేశానికి తమిళ నటిని ప్రధాని చేస్తున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

    నిత్యానంద జైలు జీవితం

    నిత్యానంద జైలు జీవితం

    నిత్యానంద మీద అత్యాచారం, లైంగిక దాడి ఆరోపణలు రావడంతో కొంత కాలం పాటు ఆయన కర్ణాటకలోని రామనగర జైల్లో జీవితం గడిపాడు. తరువాత బెయిల్ మీద బయటకు వచ్చిన నిత్యానంద కోర్టు వాయిదాలకు హాజరౌతూ వస్తున్నారు. బెంగళూరు నగర శివార్లలోని బిడిదిలో నిత్యానంద ప్రధాన ఆశ్రమం ఉంది. బిడిదిలోని ఆశ్రమంలోని శిష్యులకు నిత్యానంద అధ్యాత్మిక గురువుగా, భోదకుడిగా చలామణిఅవుతూ కాలం గడుపుతున్నాడు.

    విదేశీ భక్తుల వశీకరణ ?

    విదేశీ భక్తుల వశీకరణ ?

    విదేశీయులను తన భక్తులుగా వశపరుచుకోవడంలో సిద్దహస్తుడిగా పేరు తెచ్చుకున్న నిత్యానంద వారి నుంచి కొన్ని వందల కోట్లరూపాయలు విరాళాల రూపంలో వసూలు చేశాడని ఆరోపణలు ఉన్నాయి. అత్యాచారం, లైంగిక దాడి, పిల్లలను కిడ్నాప్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద ఇప్పుడు ఏకంగా దేశం విడిచి విదేశాలకు పారిపోయాడని సమాచారం.

    నిత్యానంద శిష్యురాలు తమిళ నటి

    నిత్యానంద శిష్యురాలు తమిళ నటి

    నిత్యానంద ఆశ్రమంలో చేరిన తమిళ నటి ఆయన ప్రధాన శిష్యురాలిగా గుర్తింపు తెచ్చుకుంది. నిజానికి ఆమె తెలుగు అమ్మాయి. అయితే తమిళ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆ నటి పలు తెలుగు సినిమాల్లో నటించింది. నిత్యానందతో చాల చనువుగా ఉంటున్న ఆనటి గురించి ఆ మధ్య కాలంలో చాలా రచ్చ రచ్చ అయ్యింది. మూడు అక్షరాల పేరు ఉన్న ఆ తమిళ నటి ప్రస్తుతం నిద్యానంద సేవలో తరిస్తోంది.

    కిడ్నాప్ కేసులో పరార్ !

    కిడ్నాప్ కేసులో పరార్ !

    నిత్యానంద తనకు తాను ఆధ్యాత్మికస్వామిగా ప్రచారం చేసుకుని అనేక రాష్ట్రాల్లో ఆశ్రమాలు పెట్టాడు. తాజాగా పిల్లలను కిడ్నాప్ చేశాడని గుజరాత్ పోలీసులు నిత్యానంద మీద కేసు నమోదు చేసి ఆయన ఇద్దరు శిష్యులు (యువతులు)ను అరెస్టు చేశారు. నిత్యానందను అరెస్టు చెయ్యడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన ఏకంగా దేశం విడిచి నకిలి పాస్ పోర్టుతో విదేశాలకు పరారైనాడని వెలుగు చూసింది. నిత్యానందను పోలీసులు అరెస్టు చేస్తే ఆయన నిజంగా నిత్యానంద ఎందుకు అవుతారు, గుట్టుచప్పుడు కాకుండా చాకచక్యంగా నిత్యానంద అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడు.

    సొంతంగా దీవి కొనేసిన నిత్యానంద

    సొంతంగా దీవి కొనేసిన నిత్యానంద

    ఉత్తర అమెరికా దేశం సమీపంలోని ఓ ప్రత్యేక దీవిని నిత్యానంద కొనేశాడని, ఆ దేశానికి కైలాస దేశం అనే పేరు పెట్టారని, అక్కడే తన 50 మంది శిష్యులతో నిత్యానంద నివాసం ఉంటున్నాడని, కైలాస దేశానికి కొన్ని టన్నుల బంగారం తీసుకెళ్లారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కైలాస దేశానికి ప్రత్యేక జెండా, సపరేట్ పాస్ పోర్టు, వీసా వంటివాటిని నిత్యానంద ఏర్పాటు చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. తన కైలాస దేశాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితికి నిత్యానంద విన్నపం పెట్టుకున్నారని, త్వరలోనే అనుమతి వస్తుందని ఆయన ఆశగా ఎదురు చూస్తున్నారని సమాచారం.

    తమిళ నటి ప్రధాని ?

    తమిళ నటి ప్రధాని ?

    కైలాస దేశానికి అధిపతి అయిన నిత్యానంద తన దేశానికి తన శిష్యురాలు, తమిళ నటిని ప్రధాని చెయ్యాలని నిర్ణయించారని తెలిసింది. ఇంత కాలం తన సేవలో తరించిన తమిళ నిటికి ఫలంగా ప్రధాని చెయ్యాలని నిత్యానంద తన శిష్యులకు చెప్పారని సమాచారం. నిత్యానంద సేవలో తరించిన ఆ నటికి ఇప్పుడు ఏకంగా ప్రధాని యోగం పట్టుకుందని ప్రచారం జరుగుతోంది. కైలాస దేశానికి తమిళ నటి ప్రధాని అవుతోందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

    భారత్ లో నిత్యానంద ?

    భారత్ లో నిత్యానంద ?

    నిత్యానంద నకిలీ పాస్ పోర్టుతో దేశం విడిచిపారిపోలేదని, ఇక్కడే ఎక్కడో తలదాచుకున్నాడని, త్వరలోనే ఆయన్ను అరెస్టు చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే విదేశాలకు పారిపోయిన నిత్యానంద కైలాస దేశం ఏర్పాటు చేసుకున్నాడని ఆయన శిష్యులు ప్రత్యేక వెబ్ సైట్ తయారు చేసి పలు వివరాలు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం నిత్యానంద గొడవ మాత్రం మరోసారి మీడియాలో హాట్ టాఫిక్ అయ్యింది. నిత్యానంద దేశానికి తమిళ నటి ప్రధాని అవుతుందా ? ఆసలు నిత్యానంద ప్లాన్ ఏమిటి ? అనే విషయంపై రోజుకో కథనం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+