పేలిపోయిన గ్యాస్ ట్యాంకర్: డ్రైవర్ సజీవదహనం?
ఉత్తర కన్నడ: వేగంగా వెళుతున్న గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డు పక్కన పల్టీ కొట్టడంతో పేలిపోయింది. మంటలు అదుపు చెయ్యడానికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు నానాతంటాలు పడుతున్నారు.
గ్యాస్ ట్యాంకర్ డ్రైవర్ ఆచూకీ తెలియడం లేదని, అతను సజీవదహనం అయిఉంటాడని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఉత్తర కన్నడ జిల్లాలోని కుమటా సమీపంలోని బారగి గ్రామం దగ్గర మంగళవారం వేకువ జామున 5.30 గంటల సమయంలో గ్యాస్ ట్యాంకర్ బెంగళూరు వైపు వేగంగా వెలుతున్నది.

ఆ సందర్బంలో ట్యాంకర్ అదుపుతప్పి పల్టీ కొట్టింది. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిసర ప్రాంతాలలో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించారు.
ముందు జాగ్రత చర్యగా రహదారికి ఇరు వైపుల రెండు కిలోమీటర్ల మేరకు వాహన సంచారం నిలిపివేశారు. మంగళూరులో ఉన్న గ్యాస్ కంపెనీ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు.
-
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్












Click it and Unblock the Notifications