‘మద్యం తాగండి’: విద్యార్థులతో టీచర్(వీడియో)
రాయపూర్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ గురువు మద్యం తాగి పాఠశాలకు రావడమేగాక, 'మందు(మద్యం)' పాఠాలు బోధించాడు. ఈ ఉదంతాన్నంత ఓ జర్నలిస్టు వీడియో తీసి ఉన్నతాధికారులకు అందించాడు. దీంతో ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ కొరియా జిల్లా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలో చోటు చేసుకుంది.
కొరియా జిల్లా ప్రభుత్వ పాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శివబరన్ మద్యం పాఠాలు చెబుతూ వీడియోలో చిక్కారు. డీ ఫర్ దారు(మద్యం), పీ ఫర్ పియో(తాగు) అంటూ కొత్త భాష్యాలు చెప్పారు. వీటిని బ్లాక్ బోర్డుపై రాసి పదేపదే విద్యార్థులతో వల్లించారు.
కాగా, ఓ జర్నలిస్ట్ ఒకరు వీడియో తీయడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. మందు పాఠాలు బోధించే సమయంలో గురువుగారు మద్యం మత్తులో ఉండడం గమనార్హం. అయితే సిలబస్ ప్రకారమే పాఠాలు చెబుతున్నానని సమర్థించుకున్నాడు శివబరన్.
అయితే మత్యం సేవించి పాఠశాలకు రావడం తప్పేనని ఒప్పుకున్నాడు. మద్యం తాగొచ్చి ఇంకెప్పుడు పాఠాలు చెప్పబోనని సంజాయిషీ ఇచ్చుకున్నాడు. కాగా, శివబరన్ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ సంజీవ్ ఝా విచారణకు ఆదేశించారు.












Click it and Unblock the Notifications