ప్రధాని మోడికి గుడి కట్టిన రైతు.. ఎక్కడ కట్టారో తెలుసా?
Recommended Video
ప్రధాని నరేంద్రమోడీ దేవుడయ్యారు. గుళ్లో ఆయన విగ్రహం ప్రతిష్టించి పూజలు చేస్తున్నాడు ఆయన అభిమాని, కాగా ప్రధాని మోడీ విగ్రహంతో పాటు హోంమంత్రి అమిత్ షా, దివంగత ముఖ్యమంత్రి జయలలిత, మరియు తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి పళని స్వామి ఫోటోలను కూడ గుళ్లో పెట్టాడు. అయితే..ప్రధాని మోడీ స్కీంలు నచ్చి ఆయనకు గుడి కట్టిచ్చినట్టు రైతు తెలిపాడు.

తమిళనాడులో మోడీకి గుడి
మనుష్యులకు గుళ్లు, గోపురాలు కట్టే సంస్కృతి ఎక్కువగా తమిళనాడు ప్రజలు చేస్తారు. ఇదివరకే చాలా మంది నాయకులు, సినిమా యాక్టర్లకు కూడ తమిళనాడులో గుళ్లు కట్టి పూజిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా మనుష్యుల దేవుళ్లలోకి ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కూడ చేరారు. తమిళనాడులోని ఓ అభిమాని ప్రధాని మోడీకి గుడి కట్టి పూజలు చేయడం ప్రారంభించాడు. కాగా ప్రధాని మోడీ తీసుకువచ్చిన పలు ఫథకాలు నచ్చి ఆయనకు గుడి కట్టించానని చెప్పాడు.

మోడీ పథకాలకు ఆకర్షితుడైన రైతు
తమిళనాడులోని ఎరకుడి గ్రామంలోని పీ శంకర్ అనే యాబై సంవత్సరాల వయస్సున్న రైతు తన వ్యవసాయ పొలంలో ప్రధాని మోడీకి గుడి కట్టి వారం రోజుల నుండి పూజలు చేస్తున్నాడు. కాగా ప్రధాని ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లాంటీ పథకాలకు మెచ్చి గుడిని కట్టినట్టు చెప్పారు. ఇందుకోసం లక్ష ఇరవై వేల రూపాయలను రైతుల ఖర్చుపెట్టినట్టు తెలిపాడు. కాగా 8 ఫీట్ల ఎత్తుతో విగ్రహాన్ని తయారు చేయించాడు. పక్కనే దీపాల కోసం స్టాండ్స్ ఏర్పాటు చేశాడు. మరోవైపు గుడిలోనే హోంమంత్రి అమిత్ షా, ప్రస్తుత తమిళనాడు సీఎం పళని స్వామి మరియు దివంగత సీఎం జయలలిత ఫోటోలను కూడ గుడిలో పెట్టాడు.

బీజేపీ సభ్యుడు కాని రైతు
అయితే శంకర్ కనీసం బీజేపీ కార్యకర్త కూడ కాదని చెప్పాడు. కేవలం ఆయన పథకాలకు ఆకర్షితుడయి గుడిని నిర్మించాడని చెప్పాడు. అయితే గుడి నిర్మించేందుకు ఎనిమిది నెలల క్రితం పునాది వేసినట్టు చెప్పారు. కాని వెంటనే దాని నిర్మాణం చేపట్టలేకపోవడంతో గత వారమే ప్రారంభించినట్టు చెప్పాడు. దీంతో విషయాన్నితెలుసుకున్న బీజేపీ నాయకులు శంకర్ దగ్గరకు చేరుకుని ఆయన్ను పార్టీలో చేరాలని అహ్వానించారు. కాగా ప్రధానిని నేరుగా చూసేందుకు ఓసారి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మమల్లా పురానికి వచ్చినప్పుడు వెళ్లానని చెప్పాడు. కాగా గతంలో శంకర్ కొన్నేళ్లు గల్ఫ్‌లో పని చేసి అనంతరం ఆడబ్బులతో గ్రామంలో వ్యవసాయ భూమి కొన్నానని చెప్పాడు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications