కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు మినీ బస్సు ఢీకొని 13మంది దుర్మరణం..
కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13మంది తమ ప్రాణాలను పొగొట్టుకున్నారు. శుక్రవారం తెల్లవారు జాము సమయంలో రాష్ట్రంలోని పూణె-బెంగళూరు హైవేపై ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఓ ట్రక్ని మినీ బస్సు ఢీకొట్టినడంతో ఈ సంఘటన జరిగింది. హావేరీ జిల్లాలోని గుండెనహల్లి క్రాసింగ్ వద్ద.. ఆగి ఉన్న ఓ ట్రక్ని ఓ మినీ బస్సు బలంగా ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించినట్లు సమాచారం. ఈ ఘటనలో 13మంది ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. నేటి (శుక్రవారం) తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాల సమయలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన మినీ బస్సులో మొత్తం 17మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే, ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే తమ ప్రాణాలు కోల్పోయారని సమాచారం.
ఇక, ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటాన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరితోపాటు గాయాపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో 11మంది అక్కడిక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఇక, మిగిలిన వారిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. భాదితులంతా శివమొగ్గకు చెందిన వారని సమాచారం. వీరంతా బెళగావి జిల్లా నుంచి తిరిగి వస్తుండగా బెపూణె-బెంగళూరు హైవేపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డుప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, మినీ బస్సు డ్రైవర్ నిద్ర కారణంగా ట్రక్‌ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రక్రియ ముమ్మరం చేశారు.













Click it and Unblock the Notifications