Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం..
జమ్మూ కాశ్మీర్(Jammu and Kashmir)లోని రాజౌరి జిల్లాలోని బెహ్రోట్ బుధాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్(Encounter) జరిగింది. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉదయం నుంచి భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. వీరికి ఉగ్రవాదులు తారసపడడ్డారు. దీంతో ఉగ్రవాదులు భద్రత దళాల పైకి కాల్పులు జరిపారు. వెంటనే భద్రత దళాలు కాల్పులు జరపడంతో ఇది ఎన్ కౌంటర్ కు దారి తీసింది. అదే సమయంలో పూంచ్ జిల్లా మెంధార్‌లో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
పూంచ్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి అనుమానాస్పద కదలికలు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. గుర్సియన్, భాటా దురియన్‌లతో సహా నియంత్రణ రేఖ వెంబడి ఫార్వర్డ్ ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. పూంచ్ జిల్లాలోని మెంధార్ సబ్ డివిజన్‌లో ఉన్న నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న డబ్బి గ్రామంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) చేసిన ప్రధాన చర్యలో, NIA పూంచ్‌లోని తెహ్రీక్-ఉల్-ముజాహిదీన్ (TUM) ఉగ్రవాది ఆస్తులను జప్తు చేసింది.

"ఉగ్రవాద సంస్థల కోసం పనిచేసిన, డ్రగ్స్ స్మగ్లర్లు, ఆయుధాలను సరఫరా చేసిన మహ్మద్ యాసిన్ ఆస్తులను జప్తు చేశారు. ఈ వ్యక్తులు తీవ్రవాద సంస్థ ఘజ్నవి ఫోర్స్‌లో పని చేసేవారు. వారిపై చాలా కేసులు నమోదయ్యాయి " అని భద్రత వర్గాలు తెలిపాయి. బాలాకోట్ ప్రాంతంలోని ధాబీ గ్రామంలోని 59 కనాల్, 12 మార్లా భూమిలో భారీ భాగాన్ని NIA అటాచ్ చేసింది. జమ్మూ NIA కోర్టు 30 సెప్టెంబర్ 2023న అటాచ్‌మెంట్ ఆర్డర్‌ను జారీ చేసింది.
"భూమి మహ్మద్ యాసిన్‌కు చెందినది. ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు, ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఉల్-ముజాహిదీన్ (TUM)కి చెందినవిగా గుర్తించాం" అని అధికారులు తెలిపారు. సరిహద్దుల ఆవల నుంచి పనిచేస్తున్న TUM/JKGF కార్యకర్తలు, బాలాకోట్ నియంత్రణ రేఖ (LOC) నుంచి పూంచ్‌లోని లోతట్టు ప్రాంతాలకు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలు మరియు మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించిన స్థానిక ప్రజలు కుట్ర పన్నారని NIA దర్యాప్తులో వెల్లడైంది.












Click it and Unblock the Notifications