vaastu tips: అటాచ్డ్ బాత్‌రూం, వాటర్ సంప్ కు సంబంధించి వాస్తు నియమాలు
ఈ రోజుల్లో ప్రతి గదికి అలాచ్డ్ బాత్‌రూం నిర్మించుకోవడం సర్వసాధారణమైపోయింది. పాతరోజుల్లో టాయిలెట్లు బయట ఉండేవి. కానీ ఈరోజుల్లో అంతా గదులకు ఆనుకొనే కట్టేస్తున్నారు. ఇంట్లో అటాచ్‌డ్ బాత్రూమ్‌లు నిర్మించేటప్పుడు దిక్కుల ఎంపిక చాలా ముఖ్యం. ఉత్తర వాయువ్యం లేదా పడమర వాయువ్య దిశల్లో బెడ్‌రూమ్‌లు నిర్మిస్తున్నప్పుడు, వాటికి అటాచ్‌డ్ బాత్రూమ్‌ల నిర్మాణం సరైన స్థానంలో ఉండాలి.
బెడ్ రూ ఫ్లోరింగ్ ఎత్తు కంటే తక్కువగా ఉండాలి
నైరుతి బెడ్‌రూమ్‌లోనైనా లేదా ఇతర బెడ్‌రూమ్‌లలోనైనా లోపలి భాగంలో వాయువ్య లేదా ఆగ్నేయ దిక్కుల్లో మాత్రమే బాత్రూమ్‌లు ఏర్పాటు చేయడం వాస్తు ప్రకారం శుభకరం. బాత్రూమ్ తలుపులు బెడ్‌కు ఎదురుగా లేకుండా చూసుకోవాలి. అలాగే క్లోసెట్ ఉత్తర లేదా దక్షిణ దిశలను చూస్తున్నట్లు అమర్చుకోవడం శ్రేయస్కరం. బాత్రూమ్ ఫ్లోరింగ్ ఎత్తు బెడ్‌రూమ్ ఫ్లోరింగ్ కంటే కొద్దిగా తక్కువగా ఉండటం, నీటి ప్రవాహం తూర్పు లేదా ఉత్తర దిశగా సాగడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులు తగ్గి, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది.

వాయువ్యంలో నీటి గొయ్యిలు వద్దు
ఇక నీటి నిల్వ కోసం తవ్వే సంప్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. మెయిన్ గేట్ పక్కన స్థలం ఉంది కదా అని వాయువ్య దిశలో సంప్ కట్టడం ఎంతమాత్రం సరికాదు. వాయువ్యం అనేది వాయుదేవుని స్థానం కావడం వల్ల అక్కడ భూమిని తొవ్వి నీటి గొయ్యి పెడితే ఆర్థిక ఇబ్బందులు, అనవసర ప్రయాణాలు, సంబంధ బాంధవ్యాలలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
ఇల్లు ఏ వైపు ముఖం చేసి ఉన్నా సరే, సంప్ నిర్మించడానికి తూర్పు ఈశాన్యం లేదా ఉత్తర ఈశాన్యం దిక్కులు మాత్రమే అత్యంత శ్రేష్ఠమైనవి. ఈశాన్యం అనేది ఈశ్వర స్థానం, నీటి మూలకం ఉన్న చోటు. అక్కడ పరిశుభ్రమైన నీటి సంప్ ఉండటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం, ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్య అభివృద్ధి, మానసిక ప్రశాంతత లభిస్తాయి. సంప్ నిర్మించేటప్పుడు అది కాంపౌండ్ వాల్‌ను నేరుగా తాకకుండా కొంత స్థలం వదిలి కట్టుకోవడం మంచిది.












Click it and Unblock the Notifications