డాన్ లాగా ఫోజు కొడుతున్న బీజేపీ లీడర్, ఓటు వేస్తే మీకథ క్లోజ్, కాంగ్రెస్ !

బెంగళూరు/బెళగావి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఎక్కువ అయ్యింది. ఎమ్మెల్యేగా ఎలాగైనా గెలవాలి అని అనుకుంటున్న బీజేపీ నాయకుడికి కాంగ్రెస్ పార్టీ నాయకులు చుక్కలు చూపించారు. బీజేపీ నాయకుడి చేతిలో రివాల్వర్ పట్టుకుని దానిని గిర్రున తిప్పుతూ ఫోజులు కొడుతున్న వీడియోను కాంగ్రెస్ పార్టీ విడుదల చెయ్యడం కలకలం రేపింది.

ఏఐసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున ఖార్గే కుమారుడు ప్రియాంక ఖార్గే కలబురిగి జిల్లాలోని చిత్తాపుర అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. చిత్తాపురకు కాంగ్రెస్ కంచుకోటగా పేరు ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి ప్రియాంక ఖార్గే తండ్రి మల్లికార్జున ఖార్గే సామాన్యమైన వ్యక్తి కూడా కాదు.

 BJP MLA

ఇలాంటి చిత్తాపుర నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థిగా మణికంఠ రాథోడ్ ఎన్నికల బరిలో దిగాడు. బీజేపీ లీడర్ మణికంఠ రాథోడ్ ఒక రౌడీషీటర్ అనే అస్త్రాన్ని ముందు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఓటు వేస్తే మీకు కష్టాలు తప్పవని ప్రచారం చేస్తోంది. ఇదే సందర్బంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ నాయకుడు మణికంఠ రాథోడ్ కు సంబంధించిన ఓ వీడియో చిక్కింది.

విలాసవంతమైన కుర్చీలో కుర్చున్న మణికంఠ రాథోడ్ రివాల్వర్ చేతిలో పట్టుకుని దానిని గిర్రున తిప్పుతూ చివరికి ఎదుటి వ్యక్తికి గురి చూపిస్తున్నట్లు ఉన్న వీడియోను కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ అధికారిక సోషల్ మీడియాలో విడుదల చేసింది. బీజేపీ నాయకుడు మణికంఠ రాథోడ్ ఓ గ్యాంగ్ స్టర్ లా ఫోజులు కొడుతూ వీడియో తీసుకున్నాడని కాంగ్రెస్ ఆరోపించింది.

ఇలాంటి మణికంఠ రాథోడ్ కు ఓటు వేస్తే ఇక్కడి ప్రజలకు సమస్యలు తప్పవని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. రౌడీషీటర్ జాబితాలో ఉన్న మణికంఠ రాథోడ్ ను కలబురిగి జిల్లా ఎస్పీ వైఎస్. రవికుమార్ జిల్లా బహిష్కరణ చేశారు. తరువాత హైకోర్టుకు వెళ్లిన మణికంఠ రాథోడ్ జిల్లా బహిప్కరణ ఆదేశాలకు స్టే తెచ్చుకున్నారు.

పేదలకు ఇస్తున్న రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నాడని, రౌడీయిజం చేసి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని బీజేపీ నాయకుడు మణికంఠ రాథోడ్ మీద కలబురిగి, బీదర్, యాదగిరి జిల్లాల్లో అనే కేసులు నమోదు అయ్యాయి, పేదల కడుపుకొట్టి రౌడీషీటర్ అయిన మణికంఠకు బీజేపీ ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగింది.

అక్రమంగా మారణాయుధాలు పెట్టుకుని ప్రజలను బెదిరిస్తున్న బీజేపీ నాయకుడు మణికంఠ రాథోడ్ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల కమీషన్ అధికారులకు ఫిర్యాదు చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. మణికంఠ రాథోడ్ దగ్గర ఉన్న రివాల్వర్ కు లైసెన్స్ కూడా లేదని కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+