Viral Video: ఉత్తరప్రదేశ్‍లో దారుణం.. భార్యభర్తలపై పెట్రోల్ బంక్ సిబ్బంది దాడి.. వీడియో వైరల్..

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. పెట్రోల తక్కువ ఎందుకు పోశారంటూ ప్రశ్నించిన భార్యభర్తలపై పెట్రోల్ బంక్ సిబ్బంది విచాక్షణరహితంగా దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన మీరట్ లో జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు.

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో భార్యభర్తలు పిల్లలతో పాటు ఓ పెట్రోల్ బంక్ వద్ద ఆగారు. అక్కడ పెట్రోల్ పోయించుకున్నారు. అయితే పెట్రోల్ బంక్ సిబ్బంది తక్కువ పెట్రోల్ పోశారు. దీనిని గమనించిన భర్త బంక్ సిబ్బందిని ప్రశ్నించారు. ఇలా మాటామాట పెరిగింది. అగ్రహించిన పెట్రోల్ బంక్ సిబ్బంది. విచాక్షణరహితంగా భార్యభర్తలు, పిల్లలపై కట్టెలతో దాడి చేశారు.

A video of a petrol station employees husband and wife being attacked in Uttar Pradesh is going viral on social media

అక్కడున్న వారు పెట్రోల్ బంక్ సిబ్బందిని నిలువరించి భార్యభర్తలను కాపాడారు. భార్యభర్తలపై బంక్ సిబ్బంది దాడి చేస్తున్న దృశ్యాలను అక్కడే ఉన్న వారు మొబైల్ షూట్ చేశారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను రవిష్ కుమార్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. "రామరాజ్ ఉత్తరప్రదేశ్‌లో ఉందా? మీరట్‌లో పెట్రోల్ పంపు సిబ్బంది గూండాయిజం, భర్త-భార్య మరియు పిల్లలను కర్రలతో కొట్టారు. తక్కువ పెట్రోల్ పోయడాన్ని నిరసించారు.కంకరఖేడాలోని రోహతా రోడ్‌కి సంబంధించిన కేసును చెబుతున్నారు. అని రాసుకొచ్చారు.

ఈ వీడియో చూసిన వారందరూ పెట్రోల్ బంక్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే వారిని అరెస్ట్ చేయాలని కోరారు. ఈవీడియో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+