viral video: పెట్రోల్ రూ. 400, నో కరెంట్.. బోర్డర్ వద్ద భారత్- పాకిస్థాన్ యువకుల సంభాషణ..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ దేశాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. యుద్ధం కారణంగా ప్రపంచ వాణిజ్యానికి వెన్నెముక అయిన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. దాంతో ప్రపంచ దేశాలకు చమురు, గ్యాస్ రవాణా నిలిచిపోయింది. ఇక అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న పాకిస్థాన్ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లుగా అయింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా పాకిస్థాన్ లాక్ డౌన్ తరహా నిబంధనల్ని అనుసరించింది. స్మార్ట్ లాక్ డౌన్ పేరుతో రాత్రి 8 గంటల వరకే షాపులు, మార్కెట్లు, ప్రజా రవాణా కు అనుమతించింది. అలాగే పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలను మూసివేసింది. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆదేశించింది.

Pakistan Crisis Exposed Indian Pakistani Youth Honest Talk Rs 400 Petrol No Electricity Goes Viral

పాకిస్థాన్ లో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర పాకిస్థాన్ లో రూ. 400 కు దాటింది. అయితే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్ అవుతోంది. భారత్- పాకిస్థాన్ బోర్డర్ వద్ద నిలబడి ఇరు దేశాల యువకులు చేసిన సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఒకర్నొకరు తమ దేశ పరిస్థితుల గురించి సంభాషణ జరిపారు. ఈ వీడియోలో.. భారత్ వైపున ఉన్న ఓ యువకుడు.. పాకిస్థాన్ వైపున ఉన్న మరో యువకుడ్ని అక్కడ పెట్రోల్ ధర ఎంత..? అని అడుగుతాడు. దానికి భారతీయులు రూ. 100 అని సమాధానం ఇస్తారు. అప్పుడు పాకిస్థాన్ యువకుడు ఇక్కడ రూ. 400 లు అని చెబుతాడు.

ఆ తర్వాత పాకిస్థాన్ యువకుడు.. మీకు అక్కడ కరెంట్ ఉందా..? అని అడుగుతాడు.. అప్పుడు భారతీయులు అవును ఉంది.. అని అంటారు.. దానికి పాకిస్థాన్ యువకులు.. ఇక్కడ కరెంట్ లేదు అని చెబుతారు. ఇది పాకిస్థాన్.. ఇటువైపు అస్సలు రాకండి.. అక్కడే సంతోషంగా ఉండండి.. అని చెబుతారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఇక పాకిస్థాన్ లో ఉన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, విద్యుత్ కోతలను ఈ వీడియో వివరిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+