వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video: అకస్మాత్తుగా రోడ్డుపైకి ఖడ్గమృగం.. తర్వాత ఏం జరిగిందంటే..?

|
Google Oneindia TeluguNews

దేశంలో అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ ఖడ్గమృగాలకు ప్రసిద్ధి. ఇక్కడ ఖడ్గమృగాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కొద్ది రోజుల క్రితం కజిరంగా నేషనల్ పార్క్ ప్రాంతంలోని హైవేపై ఓ ఖడ్గమృగాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో లారీ ఓనర్ కు జరిమానా విధించినట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆదివారం తెలిపారు.

CCTV ఫుటేజీ


జాతీయ రహదారి 37లో జరిగిన సంఘటనకు సంబంధించిన CCTV ఫుటేజీని పంచుకుంటూ, హిమంత బిస్వా శర్మ అటువంటి ప్రమాదాలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్‌పై పనిచేస్తోందని ట్వీట్ చేశారు. "ఖడ్గమృగాలు మా ప్రత్యేక స్నేహితులు; వాటి స్థలంపై ఎలాంటి ఉల్లంఘనను మేము అనుమతించము" అని ఆయన ట్వీట్ చేశారు.

అకస్మాత్తుగా హైవేపైకి

అకస్మాత్తుగా హైవేపైకి


10 సెకన్ల వీడియోలో ఖడ్గమృగం అకస్మాత్తుగా హైవేపైకి వచ్చిన ట్రక్కును ఢీకొట్టింది. ఆ తర్వాత ఖడ్గమృగం పైకి లేవడానికి ప్రయత్నించింది. కానీ సాధ్యం కాలేదు. కొద్దిసేపటి తరువాత, అది మళ్లీ లేచి అడవిలోకి వెళ్లింది. సంఘటన జరిగిన హల్దీబారి కారిడార్ వద్ద వేగ పరిమితి గంటకు 40 కి.మీ అయితే ట్రక్కు గంటకు 52 కి.మీ వేగంతో దూసుకుపోతోందని అటవీ అధికారి తెలిపారు.

ఎలివేటెడ్ కారిడార్

ఎలివేటెడ్ కారిడార్

వన్యప్రాణులను సంరక్షించేందుకు, పార్కులో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు జఖలబంధ నుంచి బోకాఖాట్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నట్లు అధికారులు వివరించారు.

English summary
A lorry hit a rhino on the highway in Assam's Kaziranga National Park area. Due to this, the lorry owner was fined.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X