Viral Video: బొలెరో పైకి దూసుకొచ్చిన ఏనుగు.. డ్రైవర్ ఏం చేశాడంటే..
సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహీంద్రా తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేయడంతో పాటు "ఇది గత గురువారం కబిని రిజర్వ్‌లో జరిగినట్లు తెలుస్తోంది. ఈ డ్రైవర్ ను ప్రపంచంలోనే అత్యుత్తమ బొలెరో డ్రైవర్‌గా అభివర్ణస్తున్న, అతనికి కెప్టెన్ కూల్ అని మారుపేరు కూడా పెడుతున్నా" అని రాసుకొచ్చారు.
వీడియోలో ఏముందంటే..
ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. ఓ వ్యక్తి తన బొలెరో వాహనంలో పర్యాటకులను ఎక్కించుకుని కర్ణాటకలోని కబిని ఫారెస్ట్ కు వెళ్లారు. అయితే వారు వెళ్లే దారిలో ఏనుగు కనిపించింది. ఆ ఏనుగు వీరి దాడి చేయడానికి ముందుకు వచ్చింది. అదే సయంలో డ్రైవర్ బొలెరోను వెనక్కి పోనిచ్చాడు. ఇలా కొంత దూరం వెనక్కి వెళ్లిన తర్వాత ఏనుగు వెళ్లిపోయింది.
This was apparently at the Kabini Reserve last Thursday. I hereby anoint the man at the wheel as the best Bolero driver in the world & also nickname him Captain Cool. pic.twitter.com/WMb4PPvkFF
— anand mahindra (@anandmahindra) September 12, 2022

లక్షకు పైగా వ్యూస్..
ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను సోమవారం మధ్యాహ్నం 2:51 గంటలకు పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు ఇప్పటి వరకు లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. 500లకు పైగా మంది రీట్వీట్ చేశారు. అయితే ఈ బొలెరో వాహనం మహీంద్రా వారు తయారు చేసిందే. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లు చేశారు. చాలా చక్కగా తప్పించుకున్నారని కొందరు కామెంట్ చేశారు.












Click it and Unblock the Notifications