నువ్వు డ్రైవర్ అయితే నాకు పిల్లలు ఎలా పుడుతారు ?, భార్య ఏం చేసిందంటే !

చెన్నై/తిరుచ్చి: లవ్ మ్యారేజ్ చేసుకున్న దంపతులు కొన్ని నెలలు మాత్రమే సంతోషంగా కాపురం చేశారు. ఆరు నెలల తరువాత దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి, భర్త ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. ఇదే విషయంలో దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. భర్త చెప్పిన మాట వినలేదని భార్య కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలోని ధరయూర్ పక్కనే ఉన్న వన్నార్ పంచాయతీ పచ్చిమలై తోనూర్ గ్రామంలో అళగేషన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అళగేషన్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం అదే ఊరికి చెందిన సంధ్యా అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న అళగేషన్ ఆమెతో ఆరు నెలలు చక్కగా కాపురం చేశాడు. తరువాత అళగేషన్, సంధ్యా దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి.

 husband-wife-

నాలుగేళ్లు గడిచినా అళగేషన్, సంధ్యా దంపతులకు సంతానం కలగకపోవడంతో వారి మధ్య తరచూ కుటుంబ కలహాలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. లారీ డ్రైవర్ అళగేషన్ యథావిధిగా పనికి వెళ్తానని భార్య సంధ్యాకు చెప్పాడు. లారీ డ్రైవర్‌గా పని చేయవద్దని, పొలాల్లో పని చేయమని సంధ్యా ఆమె భర్తకు చెప్పినట్లు సమాచారం. పొలం పనులకు వెళ్లేందుకు నిరాకరించడంతో అళగేషన్, సంధ్యా దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది.

దీంతో మనస్తాపం చెందిన సంధ్యా భర్త బయటకు వెళ్లిపోయిన తరువాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. సంధ్యా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు ఆమెను రక్షించి ధారయూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంధ్యాను పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు ప్రకటించారు.

murder

తరియూరు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టుంకు తరలించారు. సంధ్యాకు పెళ్లి అయ్యి నాలుగు సంవత్సరాలు మాత్రమే అయ్యింది. వరకట్నం వేధింపుల కారణంగా సంధ్యా ఆత్మహత్య చేసుకుందా ?, అళగేషన్ కు ఏమైనా అక్రమ సంబంధం ఉందా ?, ఆ విషయంలో సంధ్యా ఆత్మహత్య చేసుకుందా అనే కోణాల్లో విచారణ చేస్తున్నామని పోలీసులు అంటున్నారు. పెళ్లైన 4 ఏళ్లకే లవ్ మ్యారేజ్ చేసుకున్న సంధ్యా ఆత్మహత్య చేసుకోవడం, భర్త కూడా అదే ఊరికి చెందినవాడు కావడంతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+