భర్త నైట్ షిఫ్ట్..భార్య మరొకరితో ఇంకో షిఫ్ట్: కహానీ బయటపెట్టిన జీపీఎస్

బెంగళూరు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడంతో ఓ కొడుకు ఉన్నాడు. ప్రముఖ కంపెనీలో భర్త ఉద్యోగం చేస్తున్నాడు. భర్త నైడ్ డ్యూటీలు చేస్తున్నాడు. భార్య, కుమారుడికి అవసరం ఉంటుందని కారు ఇంటి దగ్గరే పెడుతున్న భర్త క్యాబ్ లో నైట్ డ్యూటీలకు వెలుతున్నాడు. అయితే భార్య అక్రమ సంబంధాన్ని సొంత కారులోని జీపీఎస్ పట్టించింది. హోటల్ లో భార్యను ఆధార్ కార్డు పట్టించడంతో భర్త కోర్టుకు వెళ్లడం హాట్ టాపిక్ అయ్యింది.

బెంగళూరు నగరంలో నివాసం ఉంటూ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న శరత్ కుమార్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడికి 2014లో స్వప్న సుందరి (పేరు మార్చడ జరిగింది) అనే యువతితో వివాహం అయ్యింది. శరత్ కుమార్, స్వప్న సుందరి దంపతులకు 6 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. బెంగళూరులోనే శరత్ కుమార్ అతని భార్య, కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నాడు.

A wife romancing her boyfriend, The car GPS that caught the wife red-handed to the husband in Bengaluru.

నైట్ డ్యూటీలు చేస్తున్న శరత్ కుమార్ తన భార్య, కుమారుడికి అందుబాటులో ఉండటానికి ఇంటి దగ్గరే సొంతకారు పెట్టాడు. అయితే శరత్ కుమార్ అతని కారుకు జీపీఎస్ ఏర్పాటు చేసి అతని స్మార్ట్ ఫోన్ కు యాక్సస్ ఇచ్చాడు. కారులో జీపీఎస్ పరికరం పెట్టిన విషయాన్ని, అతని మొబైల్ ఫోన్ కు యాక్సస్ ఉన్న విషయాన్ని శరత్ కుమార్ అతని భార్య స్వప్న సుందరికి చెప్పలేదు. ఓ రోజు రాత్రి శరత్ కుమార్ నైట్ డ్యూటీకి వెళ్లాడు. కారు ఇంటి దగ్గరే ఉంది.

రాత్రి పొద్దుపోయిన తరువాత తన కారును ఎవరు ఇంటి నుంచి బయటకు తీశారని శరత్ కుమార్ గుర్తించాడు. కారు ఎక్కడికి వెలుతోందని శరత్ కుమార్ పరిశీలించాడు. కారు నేరుగా బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు రోడ్డు మీదుగా ఓ విలాసవంతమైన హోటల్ దగ్గర ఆగిందని శరత్ కుమార్ గుర్తించాడు. రాత్రి 4 గంటల వరకు హోటల్ ముందు ఉన్న కారు వేకువ జామున 5 గంటల సమయంలో ఇంటి దగ్గర పార్క్ చేశారని శరత్ కుమార్ గుర్తించాడు.

మరుసటి రోజు శరత్ కుమార్ హోటల్ దగ్గరకు వెళ్లి ఆరా తీశాడు. రాత్రి తన భార్య స్వప్న సుందరి, ఆమె ప్రియుడు ఇద్దరి ఆధార్ కార్డులు ఇచ్చి ఐదు గంటలకు పైగా హోటల్ రూమ్ లో ఎంజాయ్ చేశారని తెలుసుకున్న భర్త హడలిపోయాడు. ఇంటికి వెళ్లి భార్య స్వప్న సుందరిని ప్రశ్నిస్తే ఆమె ప్రియుడిని పిలిపించి ఎక్కువ మాట్లాడితే చంపేస్తామని బెదిరించడంతో భర్త భయపడిపోయాడు.

భార్య స్వప్న సుందరి అక్రమ సంబంధం గురించి కారులోని జీపీఎస్ ట్రాక్ ఆధారాలు, హోటల్ లో భార్య స్వప్న సుందరి, ఆమె ప్రియుడు ఇచ్చిన ఆధార్ కార్డు ఆధారాలతో పాటు భర్త శరత్ కుమార్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి తన భార్యతో విడాకులు ఇప్పించాలని మనవి చేశాడు. శరత్ కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చెయ్యాలని కోర్టు స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసిన పోలీసులు శరత్ కుమార్ భార్యకు నోటీసులు జారీ చేసి విచారణ చేస్తున్నారు. మొత్తం మీద భార్య అక్రమ సంబంధాన్ని కారులోని జీపీఎస్ పరికరం పట్టించడం బెంగళూరులో హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+