ప్రియుడి కోసం, భర్తకు స్లో పాయిజన్ ఇచ్చి ఎలా చంపిందంటే !!
కర్ణాటకలోని ఉడిపిలో బాలక్రిష్ణ పూజారి నివాసం ఉంటున్నాడు. 18 సంవత్సరాల క్రితం ప్రతిమా అనే యువతిని బాలక్రిష్ణ వివాహం చేసుకున్నాడు. బాలక్రిష్ణకు సొంతంగా ఓ హోటల్ ఉంది, ప్రతిమా బ్యూటీపార్లల్ నిర్వహిస్తున్నది. బాలక్రిష్ణ పూజారి, ప్రతిమా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రతిమా వయసు 35 సంవత్సరాలు అయితే సంవత్సరం క్రితం వీరి జీవితం తారుమారు అయ్యింది.
ఏడాది క్రితం ప్రతిమాకు ఓ హోటల్ యజమాని పరిచయం అయ్యాడు. అతని వయసు 28 సంవత్సరాలు. తనకంటే వయసులో 8 సంవత్సరాలు చిన్నవాడైన హెటల్ వ్యాపారికి ప్రతిమా గాలం వేసింది. హోటల్ వ్యాపారికి మొత్తం 28 హోటల్స్ ఉన్నాయి. అన్ని బ్రాంచుల్లో హోటల్ వ్యాపారం బాగా జరుగుతుండటంతో ప్రతిమా ఆంటీ మోజులో పడిపోయిన అతను ఆమెకు బానిస అయ్యాడు. ప్రియుడితో కలిసి ప్రతిమా ఎక్కపడితే అక్కడ తిరగడం మొదలుపెట్టింది.

భార్య ప్రతిమా తీరుతో అనుమానం వచ్చిన బాలక్రిష్ణ ఆమె మీద నిఘా వేశాడు. చివరికి భార్య ప్రతిమా అక్రమ సంబంధం గురించి బాలక్రిష్ణకు తెలిసిపోయింది. పద్దతి మార్చుకుని బుద్దిగా ఉండాలని, లేదంటే నీ ప్రాణం తీస్తానని బాలక్రిష్ణ అతని భార్య ప్రతిమాకు వార్నింగ్ ఇచ్చాడు. కోట్లకు అధిపతి అయిన ప్రియుడిని దూరం చేసుకోవడం ఇష్టం లేని ప్రతిమా ఆమె ప్రియుడితో కలిసి భర్త బాలక్రిష్ణను హత్య చెయ్యడానికి ప్లాన్ చేసింది.
కొన్ని నెలల నుంచి ప్రతిమా ఆమె భర్తకు ఆహారంలో స్లోపాయిజన్ కలుపుతూ వచ్చింది. స్లోపాయిజ్ తీసుకోవడంతో బాలక్రిష్ణ అనారోగ్యానికి గురైనాడు 15 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన బాలక్రిష్ణ చివరికి ఇంటికి వచ్చాడు. అదే రోజు రాత్రి బాలక్రిష్ణ అతని ఇంటిలోనే చనిపోయాడు. బాలక్రిష్ణకు స్లోపాయిజ్ ఇచ్చి హత్య చేశారని పోస్టుమార్టం నివేదిక వచ్చింది. ప్రతిమా గురించి ఆమె సొంత అన్న పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తన చెల్లెలు ప్రతిమా అక్రమ సంబంధం పెట్టుకుని తన బావ బాలక్రిష్ణను హత్య చేసిందని ఆమె అన్న పోలీసులకు చెప్పాడు. పోలీసులు ప్రతిమాను అదుపులోకి తీసుకున్నారు. ప్రతిమా ప్రియుడి కోసం ఉడిపి పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications