అక్రమ సంబంధం, ఫ్రెండ్ భర్తతో మేడమ్ ?, పక్క జిల్లాలో భర్త, వాటర్ ఫాల్స్ లో !
చెన్నై/కడలూరు: వివాహం చేసుకున్న సంతోషంగా కాపురం చేసిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో ఎంజాయ్ చేశాడు. ఇదే సమయంలో భార్య కూడా ఆమె స్నేహితురాలి భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇదే సమయంలో భర్త హత్యకు గురికావడం కలకలం రేపింది.
తమిళనాడులోని కడలూరు జిల్లా కుల్లంజవాడి సమీపంలోని టీ. పాళ్యం గ్రామంలో పుత్తు దేవాలయం ఉంది. దానికి సమీపంలోని చెరకు తోటలో కుళ్లిపోయిన స్థితిలో ఓ వ్యక్తి శవం కనిపించాడు. చెరుకు తోటలో పనికి వెళ్లిన వారు ఆ వ్యక్తి ముఖం, శరీర భాగాలు కుళ్లిపోయి వికృతంగా అతను పడి ఉన్న విషయం గుర్తించి వెంటనే కుల్లంజవాడి పోలీసులకు సమాచారం అందించారు.

మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. చనిపోయిన వ్యక్తి ఎవరు?, అతను ఏ ఊరికి చెందినవాడు?, ఎవరు అతన్ని చంపి ఇక్కడ వదిలేశారు? అంటూ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. శవమై కనిపంచిన వ్యక్తి వడలూరు పార్వతీపురానికి చెందిన రాజశేఖర్ అని పోలీసుల విచారణలో తేలింది.
రాజశేఖర్ కు మంజుల అనే భార్య ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. పోలీసుల విచారణలో మంజుల దిమ్మతిరిగిపోయే సమాచారం బయటకు చెప్పింది. రాజశేఖర్, మంజుల దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమంలో తిరుపూర్‌కు చెందిన మరో యువతితో రాజశేఖర్‌కు అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడని మంజుల పోలీసులకు చెప్పింది.
అక్రమ సంబంధం కారణంగా రాజశేఖర్ తరచూ తిరుపూర్ జిల్లాకు వెళ్లి వస్తున్నాడు. రాజశేఖర్ తన కుటుంబానికి సరైన డబ్బు ఇవ్వలేదని తన ముగ్గురు కుమార్తెలతో పాటు మంజుల కూడా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారని పోలీసులు అన్నారు. ఇదే సమయంలో మంజుల ఆమె స్నేహితురాలి భర్తతో చనువు పెంచుకుని అతనితో అక్ర మసంబంధం పెట్టుకుంది.
ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న రాజశేఖర్ రోజు రాత్రి పూట మద్యం తాగి వచ్చి అతని భార్య మంజులను లైగింకంగా చిత్రహింసలకు గురిచేశాడని, అందుకు సహకరించని పక్షంలో కొట్టి వేధించేవాడని పోలీసులు అన్నారు. ఈ సందర్భంలో కుటుంబ సమస్యలతో విసిగిపోయిన మంజుల ఆమె సన్నిహితురాలు వినోదిని, ఆమె భర్త శశికుమార్‌లకు తన పరిస్థితిని చెప్పి కన్నీరుమున్నీరైంది.

దీంతో భర్త రాజశేఖర్ ను హత్య చేయాలని నిర్ణయించుకున్న మంజుల తన స్నేహితురాలు వినోధితో కలిసి ప్లాన్ చేసింది. ముందుగా అనుకున్న ప్రకారం స్నేహితురాలు వినోధిని, ఆమె భర్త, సీక్రేట్ ప్రియుడు అయిన శశికుమార్ ను తన ఇంటికి పార్టీ కోసం ఆహ్వానించింది. దాని ప్రకారం ఇద్దరూ అతని ఇంటికి వెళ్లి భోజనం చేశారు.
పార్టీ అనంతరం ఆమె స్నేహితురాలి భర్త శశికుమార్ తన వద్ద ఫారిన్ లిక్కర్ ఉందని చెప్పి రాజశేఖర్ ను ఒంటరిగా తీసుకెళ్లగా.. ముందుగా అనుకున్న ప్రకారం మద్యంలో విషం కలిపి ఇవ్వడంతో రాజశేఖర్ స్పృహతప్పి అక్కడికక్కడే మృతి చెందాడు. రాజశేఖర్ శవాన్ని చెరుకు తోటలో విసిరేసి చేతులు దులుపుకున్నారు.
ప్రియుడి మోజులో పడిపోయిన ఫేమస్ సింగర్ భార్య, అర్దరాత్రి రసపట్టులో ఉంటే !
https://telugu.oneindia.com/news/india/the-wife-who-killed-the-famous-singer-along-with-her-boyfriend-who-had-an-illicit-relationship-near-345012.html
రాజశేఖర్ హత్య తరువాత వినోదిని తన కుటుంబంతో కలిసి కొడైకెనాల్‌కు విహారయాత్రకు వెళ్లిపోయి వాటర్ ఫాల్స్ లో ఎంజాయ్ చేశారు. రాజశేఖర్ మృతదేహాన్ని ఎవరూ చూడకుండా అక్కడ చెరకు తోటలో పడవేసినట్లు మంజుల పోలీసులకు తెలిపింది. అక్రమ సంబంధం కారణంగా స్నేహితులతో కలిసి భర్త రాజశేఖర్ ను హత్య చేసిన మంజులను, కొడైక్కెనాల్ లో వినోధిని, ఆమె భర్త శశికుమార్, ఈ హత్యకు సహకరించిన మోహన్ ను కడలూరు పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications