మిడ్ నైట్ లో భర్తను ఏరైంజ్ లో చంపేసిందంటే ?, ఆంటీ స్కెచ్ అందరూ హడల్ !
చెన్నై/దిండుగల్: పదే పదే గొడవ పడుతున్న భర్తపై రగిలిపోయిన 55 ఏళ్ల మహిళ భర్త మీద వేడి నూనె పోసి అతన్ని హత్య చేసిన షాకింగ్ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో నిందితురాలు అయిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడిని తమిళనాడులోని దిండిగల్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్పించినప్పటికీ చికిత్స విఫలమై మృతి చెందాడు.
మృతుడు చెల్లాముత్తు ( 63)కు తమిళనాడులోని దిండిగల్ జిల్లా ఒద్దంఛత్రం తాలూకాకు చెందిన రైతు. 34 ఏళ్ల క్రితం చెల్లాముత్తు దూరపు బంధువు అయిన పొన్నత్తాల్ (55) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తరువాత చెల్లాముత్తు, పొన్నత్తాల్ దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడంతో ఇద్దరు కుమారులు ఉన్నారు.

మద్యానికి బానిసైన భర్త చెల్లాముత్తు తాగిన మత్తులో ఇంటికి వెళ్లి అతని భార్య పొన్నాత్తల్ తో తరచూ గొడవపడేవాడని తెలిసింది.
నువ్వు ఎవరితోనే అక్రమ సంబంధం పెట్టుకున్నావని, అందుకే తనను పట్టించుకోవడం లేదని చెల్లాముత్తు అతని భార్య పోన్నత్తాల్ నే పదేపే చిత్రహింసలకు గురి చేసేవాడని తెలిసింది. అదేవిధంగా చెల్లాముత్తు ఆగస్టు 27న మద్యం తాగి ఇంటికి వెళ్లాడు.
మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన చెల్లాముత్తు అతని భార్య పొన్నత్తాల్ తో గొడవపడ్డాడు. అంతరాత్రిలో తనకు పూరీలు, చికెన్ కూర చేసి పెట్టాలని చెల్లాముత్తు అతని భార్య పొన్నత్తాల్ ను కోరాడు. పూరీలు చెయ్యడానికి భార్య నిరాకరించింది. దీంతో చెల్లాముత్తు నిద్రపోయే ముందు అతని భార్య పొన్నత్తాల్ ను చితకబాదేశాడు. దీంతో ఆగ్రహం చెందిన పొన్నత్తాల్ బాణలిలో కొబ్బరినూనె కాచి నిద్రిస్తున్న భర్త చెల్లాముత్తు శరీరం మీద పోసింది.
సలసలా కాగుతున్న వేడినూనె మీదపడటంతో చెల్లాముత్తు ఆర్తనాదాలు చేశాడు. చెల్లాముత్తు అరుపులు విని ఇరుగుపొరుగు వారు వెళ్లి చెల్లాముత్తును ఒద్దంచిరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చెల్లాముత్తు పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స చేసిన తరువాత అతన్ని దిండిగల్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.

అయితే చికిత్స విఫలం కావడంతో చెల్లాముత్తు రాత్రి మృతి చెందాడని సోమవారం పోలీససులు తెలిపారు. చెల్లాముత్తు చనిపోయిన తర్వాత పోలీసులు హత్య కేసుగా మార్చారు. పొన్నత్తాల్‌ను అరెస్టు చేశారు. తన భర్త చెల్లాముత్తుతో విసిగిపోయానని, అందుకే తానే అతన్ని చంపేశానని పొన్నత్తాల్ అంగీకరించిందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications