గుడి బయట భర్తను నరికి చంపించిన నవవధువు, ప్రియుడి స్కెచ్ తో స్పాట్ లో !
బెంగళూరు/బెళగావి: భీముని (భీమ) అమావాస్య రోజున భర్తను పూజిస్తే భార్య ఆయుష్యు పెరుగుతుందని పెద్దల నమ్మకం. అయితే అదే రోజు భార్యతో కలిసి గుడికి వచ్చిన భర్తను అతి దారుణంగా హత్య చేశారు. గుడి సమీపంలో బైక్ వెనక్కి తీస్తున్న భర్తను వేట కొడవలితో అతి కిరాతకంగా స్పాట్ లో నరికి చంపేశారు. పెళ్లి జరిగిన నాలుగు నెలలకే భర్త దారుణ హత్యకు గురైనాడు. ఈ హత్య కేసులో మాస్టర్ మైండ్ భార్య అని వెలుగు చూడటం కలకలం రేపింది.
కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని మూడలికి తాలుకాలోని వడ్డెరటి గ్రామానికి చెందిన శంకర్ సిద్దప్ప జగముత్తి అలియాస్ శంకర్ (25) అనే యువకుడు హత్యకు గురైనాడు. హత్యకు గురైన శంకర్ భార్య ప్రియాంక జగముట్టి (21), ఆమె ప్రేమికుడు భైరనట్టి గ్రామానికి చెందిన శ్రీధర్ తల్వార్ అలియాస్ శ్రీధర్ (22)లను అరెస్టు చేశామని మంగళవారం పోలీసు అధికారులు తెలిపారు.

అమావాస్య సందర్భంగా శంకర్ తన భార్య ప్రియాంకతో కలిసి వడ్డెరటిగ్రామం బాణసిద్దేశ్వర ఆలయానికి వచ్చారు. దేవుడి దర్శనం చేసుకుని గుడిలోని బయటకు వస్తుండగా నిందితుడు శ్రీధర్ తల్వార్ ఆలయ ప్రాంగణం సమీపంలోనే శంకర్ ను అతి కిరాతకంగా నరికి చంపి పారిపోయాడు. శంకర్ హత్య జరిగిన తరువాత హంతకుడు శ్రీధర్ తో పాటు హత్యకు మాస్టర్ ప్లాన్ వేసిన శంకర్ భార్య ప్రియాంకలను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.
ముదలగి తాలూకా బైరనట్టి గ్రామానికి చెందిన శ్రీధర, ప్రియాంక స్కూల్ లో చదువుతున్నప్పుడు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ప్రియాంక, శ్రీధర్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే శ్రీధర్ తో ప్రియాంకకు పెళ్లి చెయ్యడం ఆమె కుటుంబ సభ్యులకు ఏమాత్రం ఇష్టం లేదు. శంకర్, ప్రియాంక కుటుంబ పెద్దలు కలిసి చర్చలు జరిపి 2023 మార్చి 19న శంకర్ తో ప్రియాంక వివాహం జరిపించారు.

అయితే ప్రియాంక మాత్రం ఆమె ప్రేమికుడు శ్రీధర్ తో రహస్యంగా మాట్లాడుతోంది. శ్రీధర్ తో కలిసి బయట తిరుగుతున్న ప్రియాంక పెళ్లి జరిగిన తరువాత కూడా అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆదివారం రాత్రి ప్రియాంక పుట్టినరోజును ఆమె భర్త శంకర్ కుటుంబ సభ్యులతో కలిసి చాలా ఘనంగా నిర్వహించారు. బంధువులు, స్నేహితులు అందరిని పిలిచిన శంకర్ అతని భార్య పుట్టిన రోజు సందర్బంగా మటన్ బిర్యానీ, చికెన్ కబాబ్ లు చేసి పెట్టాడు.
సోమవారం భీమ అమావాస్య సందర్బంగా భార్యతో కలిసి గుడికి వెళ్లి పాదపూజలు చేయించుకోవాలని శంకర్ అనుకున్నాడు. శంకర జగముత్తి ఆలయానికి తనతో పాటు నువ్వు రావాలని, బాణసిద్దేశ్వర ఆలయంలో పూజలు చేద్దామని శంకర్ అతని భార్య ప్రియాంకకు చెప్పాడు. అయితే ప్రియాంక ఆమె ప్రేమికుడు శ్రీధర్ కు ఫోన్ చేసి మేము గుడికి వస్తున్నామని చెప్పింది. నువ్వు కూడా గుడి వద్దకు రావాలని, అక్కడ తన భర్త శంకర్ ను చంపేయాలని ప్రియాంక ఆమె ప్రియుడు శ్రీధర్ కు చెప్పింది.
ప్రియుడు శ్రీధర్ తో కలిసి ప్రియాంక ఆమె భర్త శంకర్ హత్యకు ప్లాన్ చేసింది. ఏమీ తెలియని నంగనాచిలాగా ప్రియాంక ఆమె భర్త శంకర్‌తో కలసి ఆలయానికి వచ్చి దేవుడి దర్శనం చేసుకుంది. అనంతరం ప్రియాంక ఆమె భర్త శంకర్ ను ద్విచక్ర వాహనం తీసుకురావాలని చెప్పి ఆలయం నుంచి వేగంగా బయటకు వెళ్లిపోయింది. ఇంతలో ప్రియాంక ప్రియుడు శ్రీధర్ గుడి బయటకు వచ్చి పెద్ద వేటకొడవలి తీసుకుని బైక్ తీస్తున్నశంకర్ ను ఇష్టం వచ్చినట్లు నరికి స్పాట్ లో చంపేసి పారిపోయాడు.
అనంతరం ప్రియాంక కన్నీరుమున్నీరుగా విలపిస్తూ నా భర్తను చంపేశారు అంటూ కేకలు వేసింది. దీంతో గ్రామమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సమయంలో గ్రామస్తులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నా భర్త శంకర్ ఆదివారం రాత్రి నా పుట్టినరోజును చాలా గ్రాండ్ గా చేశాడని, ఈరోజు ఉదయం నన్ను గుడికి తీసుకు వచ్చాడని, బైక్ తీస్తున్న సమయంలో కొందరు వచ్చి తన భర్త శంకర్ ను నరికి చంపేశారని ప్రియాంక బోరున విలపిస్తూ పోలీసులకు, గ్రామస్తులకు చెప్పింది.
మా మధ్య ఎలాంటి గొడవలు లేవని, ఉదయాన్నే గుడికి తీసుకొచ్చాడని ప్రియాంక పోలీసుల ముందు కన్నీళ్లు పెట్టుకుంది. పోలీసులకు ప్రియాంక ప్రవర్తనపై అనుమానం వచ్చింది. పోలీసులు తమదైన శైలిలో ప్రియాంకను విచారించడంతో అసలు విషయం బయటపడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు హంతకుడు శ్రీధర్ ను అరెస్టు చేశారు. వివాహం చేసుకున్న తరువాత ప్రియుడు శ్రీధర్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియాంక వివాహం చేసుకున్న నాలుగు నెలలకే ఆమె భర్తను దారుణంగా చంపించిందని వెలుగు చూడటం బెళగావి జిల్లాలో కలకలం రేపింది.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications