పెళ్లి జరిగిన నెల రోజులకే భర్తను పక్కాప్లాన్ తో చంపేసిన భార్య, షిరిడి స్కెచ్ తో !

పూణే: కుటుంబ సభ్యులు సెట్ చేసిన అమ్మాయితో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న పెళ్లి చేసుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం చేసుకున్న వ్యక్తి ఇంటికి వెళ్లిన కొత్త పెళ్లికూతురు అతనితో కాపురం చేసింది. నెల రోజుల క్రితం పెళ్లి చేసుకున్న నవధంపతులు రెండు రోజుల క్రితం షిర్డీకి వెళ్లారు. ఇదే సమయంలో కొత్త పెళ్లికొడుకును కొంత మంది దారుణంగా చంపేశారు. ఈ కేసులో కొత్త పెళ్లికూతురు అరెస్టు అయ్యింది.

మహారాష్ట్రలోని పూణే సమీపంలోని పింబ్రి చించ్వాడ్‌ లో సూరజ్ రాజేంద్ర (29) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. పూణే సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో డేటా ఆపరేటర్‌గా సూరజ్ ఉద్యోగం చేస్తున్నాడు. అంకిత అనే 24 ఏళ్ల యువతితో సూరజ్ పెళ్లి జరిపించాలని కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారు. ఏప్రిల్‌ నెల చివరిలో సూరజ్ రాజేంద్ర, అంకిత గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు.

marriage
ఈ సందర్భంలో నవ దంపతులు గత ఆదివారం సూరజ్‌కు సెలవు కావడంతో షిర్డీ ఆలయానికి వెళ్లారు. ఆలయానికి వెళ్లిన తరువాత అంకిత ఆమె భర్త సూరజ్ ను సమీపంలోని పొలానికి తీసుకెళ్లింది. మధ్యాహ్నం 3 గంటలకు అంకిత ఆమె తండ్రికి ఫోన్ చేసి తన భర్త సూరజ్‌పై కొందరు దొంగలు దాడి చేస్తున్నారని భయంతో చెప్పింది. ఇది విన్న అంకిత తండ్రి భయాందోళనకు గురై పోలీసులకు సమచారం ఇచ్చారు.

అంకిత తండ్రి వెళ్లే సరికి నిర్జనప్రదేశంలో సూరజ్ చనిపోయి శవం అయ్యి పడిఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సూరజ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు. కొత్త పెళ్లి కొడుకు సూరజ్ హత్యకు గురైనా అతని భార్య అంకితకు ఒక్క చిన్నగాయం కూడా కాకపోవడంతో పోలీసులు ఆమెనును విచారించారు. ప్రకృతిలో మలమూత్ర విసర్జన చెయ్యడానికి తన భర్త సూరజ్ వెళ్లాడని అంకిత పోలీసులకు చెప్పింది.

death

ఆ సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు తన భర్త మీద దాడి చేశారని అంకిత పోలీసులకు చెప్పింది. అంకిత వాంగ్మూలం విరుద్ధంగా ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చి అంకిత మీద రహస్యంగా విచారణ చేపట్టారు. సూరజ్ అంత్యక్రియలు పూర్తి అయిన తరువాత పోలీసులు అంకితను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.

పెళ్లయినప్పటి నుంచి తన భర్త సూరజ్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, తన ప్రవర్తనపై అనుమానం వచ్చి తనను వేధిస్తున్నాడని, తనకు ఇప్పటికే చిత్రహింసలు పెట్టాడని, తనకు అక్రమ సంబంధం ఉందని తన భర్త సూరజ్ తనను చితకబాదేశాడని అంకిత పోలీసులకు చెప్పింది. తన భర్త సూరజ్ చిత్రహింసలు తట్టుకోలేక అతడిని హత్య చేయాలని తాను ప్లాన్ చేశానని అంకిత పోలీసులకు చెప్పింది.

దీంతో ఇద్దరూ ఒంటరిగా షిర్డీలోని గుడికి వెళ్లాలని నిర్ణయించుకున్నామని, ముందుగా దాచుకున్న కత్తితో తానే తన భర్త సూరజ్ ను పొలానికి తీసుకెళ్లి చంపేపపి అంకిత నేరం అంగీకరించిందని పోలీసులు తెలిపారు. అంకిత వాంగ్మూలం తీసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త సూరజ్ ను హత్య చెయ్యడాననికి అంకిత మరేదైనా ప్లాన్ చేసిందా ?, వాటి వెనుకు ఎలాంటి కారణాలు ఉన్నాయి అని అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులుతెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+