లవ్ మ్యారేజ్, బెడ్ రూమ్ లో ఏం జరిగింది ?, శవమైన భార్య !
బెంగళూరు/మైసూరు: సిటీకి వెళ్లి వస్తున్న యువకుడు అదే నగరంలో నివాసం ఉంటున్న యువతిని చూసి ఆమెను ఇష్టపడ్డాడు. కొంతకాలం అమ్మాయి వెంట తిరిగిన యువకుడు ఆమెను లొంగదీసుకున్నాడు. ప్రేమించుకున్న యువతి, యువకుడు హ్యాపీగా తిరిగి ఎంజాయ్ చేసి తరువాత లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వివాహం జరిగి రెండు సంవత్సరాలు కూడా కాకుండానే భార్య అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడంతో అందరూ హడలిపోయారు.
కర్ణాటకలోని మైసూరు నగరంలో దర్శిని (21) అనే యువతి నివాసం ఉంటున్నది. శ్రీరంగపట్టణం తాలుకాలోని బెళగూళ గ్రామంలో సూర్యా అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మైసూరుకు వెళ్లి వస్తున్న సూర్యా మూడు సంవత్సరాల క్రితం దర్శినిని చూసి ఆమె మీద మనసు పారేసుకున్నాడు. కొంతకాలం దర్శినిని చూస్తూ కాలం గడిపిన సూర్యా ఆమె మీద ఇంకా ఇష్టం పెంచుకున్నాడు.

నేను నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని సూర్యా ధైర్యం చేసి దర్శినికి చెప్పాడు. కొన్ని నెలల తురువాత దర్శిని కూడా సూర్యాను ప్రేమించింది. సంవత్సరం పాటు ప్రేమించుకున్న సూర్యా, దర్శిని తరువాత పెళ్లి చేసుకుంటామని వారి కుటుంబ సభ్యులకు చెప్పారు. అయితే ఇద్దరి పెళ్లికి ఇరువైపుల కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు.

18 నెలల క్రితం కుటుంబ సభ్యులను ఎదిరించిన ప్రేమికులు సూర్యా, దర్శిని గుడిలో పెళ్లి చేసుకుని శ్రీరంగపట్టణం సమీపంలో కాపురం పెట్టారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న దంపతులు సంతోషంగా ఉన్నారని అందరూ అనుకున్నారు. అయితే శుక్రవారం సాయంత్రం దర్శిని ఇంట్లోని బెడ్ రూమ్ లో ఉరి వేసుకుందని తెలిసింది.

వెంటనే దర్శినిని ఆమె భర్త సూర్యా కిందకు దించి మైసూరులోని ఆసుపత్రికి తరలించాడు. అయితే అప్పటికే దర్శిని చనిపోయిందని సూర్యా ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. కొంతకాలంగా సూర్య వరకట్నం కావాలని దర్శినిని వేదిస్తున్నాడని, దర్శిని చాలాసార్లు మాకు ఫోన్ చేసి చెప్పిందని, సూర్యానే మా కుతురిని చంపేసి ఆమె ఆత్మహత్య చేసుకుందని నాటకాలు ఆడుతున్నాడని దర్శిని కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. సూర్యాను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని శ్రీరంగపట్టణ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications