భర్తకు గుడ్ బై, ఇద్దరూ సెకండ్ హ్యాండ్, డిష్యూమ్ డిష్యూమ్, బీర్ బాటిల్ దెబ్బకు బలి !
చెన్నై: యువతి, యువకుడు ప్రేమించుకుని ఎంజాయ్ చేశారు. తరువాత ప్రేమికులు ఇద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వివాహం చేసుకున్న దంపతులకు ఓ కుమార్తె ఉంది. కుమార్తె పుట్టిన తరువాత దంపతులు (couple) విడిపోయారు. కూతురితో కలిసి భార్య వేరుకాపురం ఉంటుందని, భార్య (wife), బిడ్డలను వదిలేసిన మరో వ్యక్తిని ఈమె రెండో పెళ్లి చేసుకుంది. తరువాత అసలు కథ మొదలైయ్యింది.
తమిళనాడులోని (Tamil Nadu) నామక్కల్ జిల్లా రాశిపురం ప్రాంతానికి చెందిన జయలక్ష్మి (32) అనే మహిళ చదువు కునే రోజుల్లోనే నాగరజ్ అనే వ్యక్తిని ప్రేమించింది. తరువాత నాగరాజ్, జయలక్ష్మి కొంతకాలం ఎంజాయ్ చేసి తరువాత ప్రేమ వివాహం చేసుకున్నారు. నాగరాజ్, జయలక్ష్మి దంపతులకు (couple) 14 ఏళ్లు, 11 ఏళ్లు ఉన్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

గత 5 ఏళ్ల క్రితం నాగరాజ్, జయలక్ష్మి దంపతుల (couple) మధ్య తేడాలు రావడంతో నిత్యం గొడలు పడటం మొదలుపెట్టారు. పెద్దలు రాజీ చేసినా ఫలితం లేకుండాపోయింది. తరువాత భార్యాభర్తలు (couple) అభిప్రాయ బేధాల కారణంగా విడివిడిగా ఉంటున్నారు. ఇద్దరు కుమార్తెలతో కలిసి జయలక్ష్మి అమ్మాపేటలో వేరుగా నివాసం ఉంటు ఉద్యోగం చేస్తూ పిల్లలను చదివించుంటూ పెంచిపోషిస్తున్నది.
వీళ్ల కథ పక్కనపెడితే మరో కథ తెరమీదకు వచ్చింది. తమిళనాడులోని సేలం దడగపట్టి ప్రాంతానికి చెందిన తమిళజగన్ (31) అనే వక్తి 14 ఏళ్ల క్రితం మెట్టూరుకు చెందిన వినోదిని అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్య వినోదినితో తమిళజగన్ సంతోషంగా కాపురం చేశాడు. తమిళజగన్, వినోదిని దంపతులకు (couple) 6 ఏళ్ల కుమారుడు, 12 ఏళ్ల కుమార్తె ఉన్నారు.

ఈ స్థితిలో కుటుంబ కలహాలతో రెండేళ్ల క్రితం తమిళజగన్, వినోదిని దపంతులు (couple) గొడవలు పడి తరువాత ఇద్దరూ విడిపోయారు. భార్య (wife)వినోదిని, పిల్లలను విడిచిపెట్టిన తమిళజగన్ అతని దారి అతనుచూసుకున్నాడు. భార్య (wife) వినోదినితో విడిపోయిన తర్వాత తమిళజగన్ వేరుగా నివాసం ఉంటున్న సమయంలో భర్తను వదిలేసిన జయలక్ష్మితో పరిచయం ఏర్పడింది.
తర్వాత తమిళజగన్, విజయలక్ష్మి ఇద్దరూ రెండో పెళ్లి చేసుకుని అమ్మపేట ప్రాంతంలోని ఓ ఇంట్లో అద్దెకు (couple) ఉంటున్నారు. విజయలక్ష్మి మొదటి భర్తకు (husband) పుట్టిన ఇద్దరు కుమార్తెలను తమిళజగన్ చూసుకుంటున్నాడు. జయలక్ష్మి మొదటి కుమార్తె 9వ తరగతి చదువుతోంది. జయలక్ష్మి పెద్ద కూతురు పాఠశాల నెలవారీ పరీక్షలో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
తరువాత జయలక్ష్మి, ఆమె రెండో భర్త (husband) తమిళజగన్ రెచ్చిపోయి చేతికి దొరికిన వస్తువులతో ఒకరిమీద ఒకరు దాడులు చేసుకున్నారు. పక్కటింటి వాళ్లు సర్దిచెప్పినా ఇద్దరూ మాటవినలేదని తెలిసింది. తరువాత ఇంటి మేడ మీదకు వెళ్లిన జయలక్ష్మి అక్కడ ఉన్న ఖాలీ బీర్ బాటిల్ (beer bottle) పగలగొట్టి ఇంట్లోకి తీసుకు వచ్చింది. ఆ సమయంలో జయలక్ష్మి పగలగొట్టిన బీరు బాటిల్ (beer bottle)తో ఆమె గొంతులో పొడుచుకుందిన ఆమె రెండో భర్త తమిళజగన్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

జయలక్ష్మి మెడలోంచి రక్తం ఇల్లంతా వ్యాపించడంతో రక్తపుమడుగులో ఆమె స్పాట్ లో ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న అమ్మపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జయలక్ష్మి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సేలం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం జయలక్ష్మి రెండో భర్త (husband) తమిళజగన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అమ్మపేట పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారిస్తున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications