Begging: 45 రోజుల్లో రూ.2.5 లక్షలు.. అదీ భిక్షాటన చేసి..!
చాలా మంది భిక్షాటన చేసే వారిని చూసి అసహించుకుంటారు. కొందరు జాలి పడతారు. అయితే వారి సంపాదన చూస్తే మనపై వారు జాలి పడే పరిస్థితి వస్తుంది. కొంత మంది భిక్షాటన చేసి కోట్లు సంపాదిస్తున్నారు. తాజాగా ఓ మహిళ 45 రోజులుల్లో భిక్షాటన చేసి రూ.2.50 లక్షలు సంపాదించారు. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండోర్ లో ఇంద్రా భాయి అనే మహిళ భిక్షాటన చేసి ఇంత మొత్తం సంపాదించారు. ఆమె తన ఏడుగురు పిల్లలతో బెగ్గింగ్ మాఫియా కొనసాగిస్తోంది.
ఇంద్రా భాయి ఇండోర్ లోని రద్దీగా ఉండే టెంపుల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల్లో భిక్షాటన చేస్తోంది. ఆమె పిల్లలతో కూడా భిక్షాటన చేయిస్తోంది. ఇంద్రా భాయి పిల్లల్లో ఒకరు ప్రవేక్ అనే ఓ స్వస్ఛంద సంస్థకు ఫిర్యాదు చేసింది. తన తల్లి తనతో బలవంతంగా భిక్షాటన చేయిస్తుందని పేర్కొంది.
దీంతో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఇంద్రా భాయి గురించి విచారణ చేశారు. ఈ క్రమంలో వారికి తెలిసిన విషయాలతో ఆశ్చర్యపోయారు. ఇంద్రా భాయి ఎంత సంపాదించిందో తెలుసుకని షాక్ అయ్యారు.

ఇంద్రా భాయికి రాజస్థాన్ కోట ప్రాంతంలో రెండస్థుల ఇల్లు ఉందని తెలిసింది. ఆమెకు వ్యవసాయ భూమితో పాటు భర్తకు రూ.1 లక్ష విలువ చేసే బైక్ ఉన్నాయి. ఆమె బ్యాంకు అకౌంట్ లో రూ.50 డబ్బు ఉంది. ఆమె 45 రోజుల్లో రబ.2 లక్షల 50వేలు సాంపాధించినట్లు ఇంటికి రూ.లక్ష పంపించినట్లు ప్రవేక్ సంస్థ ప్రతినిధులు గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంద్రా భాయిని అరెస్ట్ చేశారు.
ఆమె వద్ద రూ.19,600 ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు ఇంద్రా భాయిని పోలీసులు రిమాండ్ లోకి తీసుకున్నారు. ఇండోర్ మున్సిపాలిటీలో కొంత మంది భిక్షాగాళ్లు బెగ్గింగ్ చేసి సంవత్సరానికి రూ.20 కోట్లు సంపాదిస్తున్నారని అంచనా.












Click it and Unblock the Notifications