మంచం మీదకు పిలిచిన మామ: సర్దుకుపోవాలని అమెరికా టెక్కీ మొగుడు
బెంగళూరు: కట్టుకున్న భర్త తండ్రి నిత్యం లైంగికదాడి చెయ్యడంతో విరక్తి చెందిన నవవధువు బెంగళూరులోని బసవణగుడి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. లైంగిక దాడికి పాల్పడుతున్న మామ వెంకటపతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
అమెరికాలో ఉన్న బాధితురాలు నిత్య (పేరు మార్చడం జరిగింది) భర్త రఘనందన్, ఆమె తల్లి ఉషాను బెంగళూరు రావాలని పోలీసు అధికారులు సూచించారు. తుమకూరుకు చెందిన నిత్య, బెంగళూరులోని ఇందిరానగర్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు రఘనందన్ ల పెళ్లి చెయ్యాలని పెద్దలు నిర్ణయించారు.
నిత్య, రఘనందన్ ల వివాహం 2016 ఏప్రిల్ 27వ తేది తుమకూరులోని గవిగంగ కల్యాణమంటపంలో జరిగింది. వివాహం జరిగిన వారం రోజుల తరువాత టెక్కీ రఘనందన్ ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లాడు. నిత్య ఇందిరానగర్ లో మామ వెంకటపతి, అత్త ఉషాతో కలిసి నివాసం ఉంటున్నది.

ఇంటిలో తన మీద మామ వెంకటపతి ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తూ లైంగిక దాడికి పాల్పడ్డాడని, అత్త ఉషాకు చెబితే మీ మామ చెప్పినట్లు నడుచుకోవాలని అంటున్నారని, అమెరికాలో ఉన్న భర్త రఘనందన్ కు ఫోన్ చేస్తే నేను వచ్చే వరకు మా నాన్నతో సర్దుకుపోవాలని అంటున్నారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన మామ వేధింపులు తట్టుకోలేక తల్లిదండ్రుల దగ్గర డబ్బు తీసుకుని తానే స్వయంగా అమెరికా వెళ్లానని, రెండు నెలలు పూర్తి కాకముందే అత్తా, మామ అమెరికా వచ్చారని, అక్కడ తనను మామ వెంకటపతి లైంగికంగా వేధించారని నిత్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మా నాన్న చెప్పినట్లు వినకుంటే నిన్ను ఇక్కడే చంపేస్తానని భర్త రఘనందన్ బెదిరించారని, చివరికి తాను అమెరికా నుంచి పుట్టింటికి చేరుకున్నానని నిత్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను పుట్టింటిలో ఉన్న సమయంలో బెంగళూరు వచ్చిన మా మామ ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతూ ఇంటికి వచ్చి నా పక్కన పడుకొని లైంగిక కొర్కె తీర్చాలని వేధించాడని నిత్య ఆరోపిస్తున్నారు.
అమెరికా వెళ్లే సమయంలో నన్ను పిలుచుకుని వెళ్లాలని తన భర్తకు చెబితే వీసా వచ్చిన తరువాత తీసుకు వెలుతానని చెప్పి వెళ్లాడని, తరువాత ఆ విషయం పట్టించుకోలేదని, పెళ్లి సమయంలో బంగారు నగలు, వెండి వస్తువులతో పాటు రూ. 10 లక్షలు ఖర్చు పెట్టి ఘనంగా మా కుటుంబ సభ్యులు వివాహం జరిపించారని నిత్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నాభర్త, అత్త ప్రోత్సహంతోనే మా మామ వెంకటపతి లైంగిక దాడికి పాల్పడ్డాడని నిత్య ఫిర్యాదు చెయ్యడంతతో ముగ్గురి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. మామ వెంకటపతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అమెరికాలో ఉన్న భర్త రఘనందన్, అతని తల్లి ఉషాను బెంగళూరు రప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications